Ujjain : ప్రాణం తీసిన ట్రోలింగ్.. చీరలో అబ్బాయి రీల్, ఆ కామెంట్లు తట్టుకోలేక ఆత్మహత్య, ఏమని కామెంట్స్ చేశారంటే

Instagram influencer Pranshu : ప్రన్షు అబ్బాయి అయినా చీరకట్టు, మేకప్ లో అచ్చం అమ్మాయిలా కనిపించాడు. ఓ రీల్ చేసి ఇన్ స్టాలో అప్లోడ్ చేశాడు. ఈ వీడియోకి మంచి స్పందనే వచ్చింది. ఏకంగా 4వేల కామెంట్లు వచ్చాయి.

Ujjain : ప్రాణం తీసిన ట్రోలింగ్.. చీరలో అబ్బాయి రీల్, ఆ కామెంట్లు తట్టుకోలేక ఆత్మహత్య, ఏమని కామెంట్స్ చేశారంటే

Instagram influencer Pranshu (Photo : Google)

Updated On : November 25, 2023 / 1:35 PM IST

సోషల్ మీడియా.. ఓవర్ నైట్ లో పాపులారిటీ తెస్తుంది. కామన్ మ్యాన్ ని కూడా సెలెబ్రిటీగా మార్చేస్తుంది. అదీ సోషల్ మీడియాకున్న పవర్. అదే సమయంలో సోషల్ మీడియా కారణంగా ప్రాణాలు కూడా పోతున్నాయి. కొందరి కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. సోషల్ మీడియా వల్ల జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటోంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా సోషల్ మీడియా కారణంగా ఓ అబ్బాయి ఆత్యహత్య చేసుకున్నాడు. 16ఏళ్లకే అతడికి నూరేళ్లు నిండాయి.

ఆ అబ్బాయి పేరు ప్రన్సు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో నివాసం ఉంటాడు. వయసు 16ఏళ్లు. టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. అయితే, ప్రన్షు రీల్స్ చేస్తుంటాడు. వాటిని ఇన్ స్టాగ్రామ్ లో పెడుతుంటాడు. అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్ గా రీల్స్ చేసేవాడు ప్రన్షు. అమ్మాయిల మాదిరి మేకప్, డ్రెస్ వేసుకుని రీల్స్ చేసేవాడు. అబ్బాయే అయినప్పటికీ.. అచ్చం అమ్మాయిని తలిపించేలా మేకప్ అయ్యేవాడు. అమ్మాయిల తరహాలో రెడీ అయ్యి రీల్స్ చేసి వాటిని ఇన్ స్టాలో పెట్టేవాడు. కాస్త వెరైటీగా ప్రన్షు చేసే వీడియోలు నెటిజన్లను అట్రాక్ట్ చేసేవి. ఇన్ స్టాలో అతడికి 13వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. మేకప్ ఆర్టిస్ట్ కావాలన్నది ప్రన్షు కోరిక.

Also Read : దారుణం.. అమ్మాయిలను రూమ్‌లోకి పిలిచి స్కూల్ ప్రిన్సిపల్ వికృత చేష్టలు, బాధితుల్లో 142మంది ఆడపిల్లలు

అయితే ఇటీవల ప్రన్షు.. చీర, ఆభరణాలు ధరించి ఓ రీల్ చేశాడు. ఆ తర్వాత దారుణం జరిగిపోయింది. ప్రన్షు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులు, అతడి ఫాలోవర్లు షాక్ కి గురయ్యారు. ప్రన్షు ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడని తెలిసి విస్తుపోయారు.

ప్రన్షు ఆత్మహత్యకు కారణం నెటిజన్లు చేసిన ట్రోలింగ్, వల్గర్ కామెంట్లే అని తెలుస్తోంది. ఇటీవల (నవంబర్ 12న) ప్రన్షు ఓ రీల్ చేశాడు. అందులో అచ్చం అమ్మాయిలా మేకప్ వేసుకున్నాడు. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి రీల్ చేశాడు. ప్రన్షు అబ్బాయి అయినా చీరకట్టు, మేకప్ లో అచ్చం అమ్మాయిలా కనిపించాడు. ఈ రీల్ ని అతడు ఇన్ స్టాలో అప్లోడ్ చేశాడు. ఈ వీడియోకి మంచి స్పందనే వచ్చింది. ఏకంగా 4వేల కామెంట్లు వచ్చాయి. అయితే, వచ్చిన కామెంట్స్ లో దాదాపుగా అన్నీ చాలా అసభ్యకరంగా ఉన్నాయి. నెటిజన్లు పచ్చి బూతులు తిడుతూ కామెంట్లు పెట్టారు. ఆ కామెంట్స్ లో చాలావరకు వల్గర్ గా ఉన్నాయి. ప్రన్షుని బాగా ట్రోలింగ్ చేశాడు. ప్రన్షు గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడారు.

Also Read : బిర్యానీ కోసం యువకుడిని హత్య చేసిన బాలుడు .. మృతదేహం పక్కనే డ్యాన్స్

”ఈ రీల్ చేశాక నువ్వు స్కూల్ లో నీ ముఖం ఎలా చూపించగలవు? ఇస్కే సల్వార్ మే మేరా తల్వార్, నువ్వు అమ్మాయికి తక్కువ హిజ్రాకు ఎక్కువ. నీకు ఏదో బయోలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నట్లు ఉంది. నువ్వు హిజ్రావి. అచ్చం హిజ్రాలా ఉన్నావు అంటూ చాలా కామెంట్స్ వచ్చాయి. అవన్నీ కూడా చాలా వల్గర్ గానూ, అభ్యంతరకంగా ఉన్నాయి. తన గురించి నీచంగా మాట్లాడుతూ చేసిన కామెంట్లను చూసి ప్రన్షు తట్టుకోలేకపోయాడని, అతడి గుండె బద్దలైందని, ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. ప్రన్షు ఆత్మహత్యకు అసలు కారణం ఏంటో తెలుసుకునే పనిలో పడ్డారు.

 

 

View this post on Instagram

 

A post shared by ???????. (@glamitupwithpranshu)