బోరుబావిలో చిన్నారి – రంగంలోకి సైన్యం

  • Published By: venkaiahnaidu ,Published On : March 21, 2019 / 10:22 AM IST
బోరుబావిలో చిన్నారి – రంగంలోకి సైన్యం

Updated On : March 21, 2019 / 10:22 AM IST

హర్యానా రాష్ట్రంలోని హిసర్ జిల్లాలోని బల్ సమంద్ గ్రామంలో  మార్చి  20, 2019న 18 నెలల బాలుడు ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడ్డాడు. చిన్నారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు NDRF, సైన్యం, స్థానిక అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం(మార్చి-21,2019) పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. బోరుబావిలో చిన్నారి సురక్షితంగానే ఉన్నాడని, ఆక్సిజన్ సరఫరా చేస్తున్నట్లు ప్రకటించారు.
Read Also : ‘Notebook’ : కాశ్మీర్ సమస్యకు సల్లూ భాయ్ సూచన

చిన్నారి కదలికలను అనుక్షణం గుర్తించేందుకు ఓ నైట్ విజన్ కెమెరాను బోరుబావిలోకి పంపారు. బావిలోతు 60 అడుగులు ఉంది. దీనికి 20 అడుగుల దూరంలో.. సమాంతరంగా మరో టన్నెల్ ని తవ్వుతున్నారు. లోతు వెళ్లే కొద్దీ రాళ్లు వస్తున్నాయని.. అందుకే ఆలస్యం అవుతున్నట్లు చెబుతున్నారు అధికారులు. అయినా భారీ యంత్రాల సాయంతో.. పనులు జరుగుతున్నాయని.. చిన్నారిని సరక్షితంగా బయటకు తీసుకొస్తామని ధీమాగా చెబుతున్నారు అధికారులు.
గురువారం ఉదయం చిన్నారిని వల సాయంతో బయటికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నించింది. ప్రయత్నం ఫలించలేదు. రెండు, మూడు మార్గాల ద్వారా బయటకు తీసేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం అయ్యి.. చిన్నారి క్షేమంగా బయటికి రావాలని అందరూ పూజలు చేస్తున్నారు.
Read Also : కొడుకు కోసం వృద్ధ దంపతుల దీనస్థితి : పోలీసుల ఔదార్యం