అయ్యో పాపం : డ్యాడీ బైక్ కిందే పడి చనిపోయింది

చెన్నైలో విషాదం జరిగింది. తండ్రి బైక్ కిందే పడి కూతురు చనిపోయింది. పాప వయసు 18 నెలలు. కంటతడి పెట్టించే ఈ విషాదం చెన్నైలోని పునమల్లే హై రోడ్డుపై జరిగింది. వెంకటేషన్

  • Published By: veegamteam ,Published On : April 6, 2019 / 11:12 AM IST
అయ్యో పాపం : డ్యాడీ బైక్ కిందే పడి చనిపోయింది

Updated On : April 6, 2019 / 11:12 AM IST

చెన్నైలో విషాదం జరిగింది. తండ్రి బైక్ కిందే పడి కూతురు చనిపోయింది. పాప వయసు 18 నెలలు. కంటతడి పెట్టించే ఈ విషాదం చెన్నైలోని పునమల్లే హై రోడ్డుపై జరిగింది. వెంకటేషన్

చెన్నైలో విషాదం జరిగింది. తండ్రి బైక్ కిందే పడి కూతురు చనిపోయింది. పాప వయసు 18 నెలలు. కంటతడి పెట్టించే ఈ విషాదం చెన్నైలోని పునమల్లే హై రోడ్డుపై జరిగింది. వెంకటేషన్ అతడి భార్య మెట్రో రైల్ లో పని  చేస్తారు. కూతురు వన్యశ్రీని తీసుకుని వారు బైక్ పై ఇంటికి వెళ్తున్నారు. ఇంతలో ఊహించని ప్రమాదం జరిగింది. వెంకటేషన్ బైక్ ను మరో బైక్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బండి పెట్రోల్ ట్యాంక్ సీటుపై ఉన్న వన్యశ్రీ ఎగిరి కిందపడింది. తల్లిదండ్రులు కూడా కింద పడ్డారు. వారిద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. పాప మాత్రం స్పాట్ లోనే చనిపోయింది. అంతర్గతంగా తీవ్రగాయాలు కావడంతో పాప చనిపోయిందని వైద్యులు చెప్పారు.
Read Also : ఎన్నికల బరిలో నేరచరితులు : 213 మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు

కళ్ల ముందే కన్నకూతురు చనిపోవడం ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. కన్నీటి పర్యంతం అయ్యారు. వెంకటేషన్ బైక్ ను ఢీకొట్టిన మోటార్ సైక్లిస్ట్ పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ వ్యక్తిని పట్టుకునే పనిలో ఉన్నారు. పోస్టుమార్టం కోసం వన్యశ్రీ మృతదేహాన్ని కిల్ పాక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఐపీసీ 304(ఏ) (నిర్లక్ష్యంతో చావుకి కారణం), ర్యాష్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన మోటారిస్ట్ కోసం వేట కొనసాగిస్తున్నారు.
Read Also : ఓటు వేయండి : పెట్రోల్, డీజిల్ పై 50 పైసలు డిస్కాంట్ పొందండి