ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం : చెవిలో వేయాల్సిన మందు నోట్లో వేశారు, 2నెలల బాబు మృతి

ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం చిన్నారి ప్రాణం తీసింది. నర్సు నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. నర్సు చేసిన పొరపాటుతో రెండు నెలల బాలుడికి అప్పుడే నూరేళ్లు

  • Published By: veegamteam ,Published On : February 18, 2020 / 07:35 AM IST
ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం : చెవిలో వేయాల్సిన మందు నోట్లో వేశారు, 2నెలల బాబు మృతి

Updated On : February 18, 2020 / 7:35 AM IST

ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం చిన్నారి ప్రాణం తీసింది. నర్సు నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. నర్సు చేసిన పొరపాటుతో రెండు నెలల బాలుడికి అప్పుడే నూరేళ్లు

ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం చిన్నారి ప్రాణం తీసింది. నర్సు నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. నర్సు చేసిన పొరపాటుతో రెండు నెలల బాలుడికి అప్పుడే నూరేళ్లు నిండాయి. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని అమృత ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యం వికటించి రెండు నెలల బాలుడు మృతి చెందాడు. నర్సు.. చెవిలో వేయాల్సిన మందును బాలుడి నోట్లో వేసింది. దీంతో బాబు ఆరోగ్యం విషమించింది. మెరుగైన చికిత్స కోసం హైదరబాద్ తరలిస్తుండగా మార్గం మధ్యలోనే బాబు మృతి చెందాడు.

ఆసుపత్రి నిర్లక్ష్యమే బాబు మృతికి కారణమని.. అమృత ఆసుపత్రిపై బాలుడి బంధువులు దాడి చేశారు. ఆసుపత్రి అద్దాలు పగలకొట్టారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. బాబు మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. బాలుడి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఆసుపత్రి యాజమాన్యాన్ని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అసలేం జరిగిందో తెలుసుకుంటున్నారు.

ఇటీవలే ఆ దంపతులకు బాబు పుట్టాడు. దీంతో ఆనందంగా ఉన్నారు. బాబుని చూసుకుని మురిసిపోయారు. ఇంతలోనే ఘోరం జరిగింది. ఆసుపత్రి సిబ్బంది చేసిన తప్పు బాబు ప్రాణం తీసిందని అంటున్నారు. బాబు ఇక లేడు అనే వార్తను తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యానికి లక్షలకు లక్షలు వసూలు చేస్తారు. ట్రీట్ మెంట్ విషయంలో మాత్రం క్వాలిటీ ఉండటం లేదు. ఎక్స్ పీరియన్స్ లేని వారిని విధుల్లోకి తీసుకుంటున్నారు. తక్కువ జీతానికి ఎలాంటి అనుభవం, అవగాహన లేని వారిని అపాయింట్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి ఆసుపత్రులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే కానీ.. పరిస్థితిలో మార్పు రాదని అంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.