29 Cows Dead : ఒకే లారీలో కుక్కి ఆవులు తరలింపు.. ఊపిరాడక 29 మృతి

ఉత్తరప్రదేశ్‌ లో దారుణం జరిగింది. ఒకే లారీలో 30 గోవులను కుక్కి తరలిస్తుండగా ఊపిరాడక 29 ఆవులు మృతి చెందాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

29 Cows Dead : ఒకే లారీలో కుక్కి ఆవులు తరలింపు.. ఊపిరాడక 29 మృతి

cows found dead

Updated On : November 26, 2022 / 12:09 PM IST

29 Cows Dead : ఉత్తరప్రదేశ్‌ లో దారుణం జరిగింది. ఒకే లారీలో 30 గోవులను కుక్కి తరలిస్తుండగా ఊపిరాడక 29 ఆవులు మృతి చెందాయి. ఈ ఘటన మథుర జిల్లాలో చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఓ లారీ నిండా ఆవులు కుక్కి ఉన్నాయని మథుర సర్కిల్‌ పోలీసులకు సమాచారం అందింది. దాంతో సర్కిల్‌ ఆఫీసర్‌ హర్షిత సింగ్‌ నేతృత్వంలోని పోలీసు బృందం వెంటనే అక్కడికి చేరుకుంది.

Cows Died : విశాఖ జ్ఞానానంద ఆశ్రమంలో సరైన పోషణ లేక.. 12 ఆవులు మృతి

లారీలోని ఆవులను పరిశీలించగా 29 గోవులు చనిపోయి ఉన్నాయి. కేవలం ఒక్క ఆవు మాత్రమే ప్రాణాలతో ఉంది. లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యారు. ఆవులు మృతి చెందిన విషయాన్ని గమనించే డ్రైవర్‌ లారీని ఆపి పారిపోయి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.