3 Girls kidnaped : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు కిడ్నాప్

3 Girls kidnaped : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు కిడ్నాప్

3 Girls Kidnaped Vanasthalipuram

Updated On : April 10, 2021 / 1:44 PM IST

3 Girls kidnaped from one family in vanasthalipuram : హైదరాబాద్ వనస్ధలిపురంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు కిడ్నాప్ అయిన ఘటన స్ధానికంగా కలకలం రేపింది. వనస్ధలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెళ్లు ఆదృశ్య మయ్యారు.

శుక్రవారం ఉదయం నుంచి తమ కూతుళ్లు ఐశ్వర్య (17), ఆస్మా (15), అబీర్‌ (14) కనిపించట్లేదని వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురిని గతంలో ఐశ్వర్యను ప్రేమిస్తున్నానని వెంటపడిన రమేష్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసిన ట్లు తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గతంలో ఐశ్వర్యను ప్రేమస్తున్నానని చెప్పి వేధించిన రమేష్ అనే వ్యక్తి ముగ్గురిని కిడ్నాప్ చేసినట్లు ఆరోపిచారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.