Expressway : ఈ ఎక్స్‌ప్రెస్ వే వెరీ డేంజర్..జర జాగ్రత్త
బెంగళూరు- మైసూర్ ఎక్స్ ప్రెస్ వే రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ రోడ్డును ఈ ఏడాది మార్చి నెలలో ప్రారంభించగా కేవలం 4 నెలల్లోనే 308 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఈ ఎక్స్‌ప్రెస్ వే నిత్యం రోడ్డు ప్రమాదాలతో రక్తసిక్తంగా మారింది....

Bengaluru-Mysuru highway
Expressway : బెంగళూరు- మైసూర్ ఎక్స్ ప్రెస్ వే రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. (Bengaluru-Mysuru highway) ఈ రోడ్డును ఈ ఏడాది మార్చి నెలలో ప్రారంభించగా కేవలం 4 నెలల్లోనే 308 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఈ ఎక్స్‌ప్రెస్ వే నిత్యం రోడ్డు ప్రమాదాలతో రక్తసిక్తంగా మారింది. ఈ ఎక్స్‌ప్రెస్ వేపై 4 నెలల్లో 308 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 100మంది మృతి చెందారు. (308 accidents, 100 fatalities)
Seema-Sachin Love Story : సీమా హైదర్, సచిన్ మీనాల ప్రేమ కథలో ట్విస్ట్… పాక్ దోపిడీ దొంగ హెచ్చరిక
ఈ ప్రమాదాల్లో మరో 335 మంది గాయపడ్డారని సాక్షాత్తూ కర్ణాటక రాష్ట్ర హోంశాఖ మంత్రి జి పరమేశ్వర చెప్పారు. ఈ రోడ్డు నిర్మాణంలో లోపాల వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్ల నిర్మాణంలో లోపాలను సరిదిద్దాలని మంత్రులు నేషనల్ హైవే అథారిటీకి తెలిపారు. ఈ రోడ్డు ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎన్ని లోపాలున్నాయో, భద్రతా చర్యలకు సంబంధించి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి సతీష్ జార్కిహోళి నేషనల్ హైవే అథారిటీకి ఇప్పటికే లేఖ రాశారని, సైనేజీలు లేకపోవడం వంటి సమస్యలపై హోం శాఖ వారికి లేఖ రాస్తుందని మంత్రి పరమేశ్వర చెప్పారు.
Cobra Snake Enters Bathroom : బాత్రూంలో పడగవిప్పిన నాగు పాము ప్రత్యక్షం
ఈ రోడ్డుపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్ హైవేను పరిశీలిస్తే చాలా లోటుపాట్లు ఉన్నాయి. వంపులు, ఇరుకైన దారులను సూచించే సంకేతాలు లేవు. దీనివల్ల రోడ్డు బాగా ఉన్నందున వాహనదారులు ఓవర్ స్పీడ్‌గా వెళుతున్నారు. రోడ్డు ప్రారంభోత్సవం జరిగిన వెంటనే మార్చిలో 62 ప్రమాదాలు జరిగాయని, అందులో 20 మంది మరణించగా, 63 మంది గాయపడ్డారని మంత్రి తెలిపారు.
Kedarnath Dham Yatra : భారీవర్షాలతో కేదార్‌నాథ్ యాత్రకు బ్రేక్
ఏప్రిల్ నెలలో 75 ప్రమాదాల్లో 23 మంది మరణించగా, 83 మంది గాయపడ్డారు. మేలో 94 ప్రమాదాలు 29 మరణాలు, 93 మంది గాయాలకు దారితీశాయి. జూన్‌లో 28 మరణాలు, 96 మంది గాయాలతో 77 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఎక్స్‌ప్రెస్‌వే పొడవునా హైవే పెట్రోలింగ్ వాహనాలను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి 30 నుంచి 35 కిలోమీటర్లకు పెట్రోలింగ్ వాహనాలను మోహరిస్తే, వారు వేగంగా వెళ్లే వారిపై నిఘా ఉంచవచ్చని మంత్రి పరమేశ్వర వివరించారు.

308 accidents