Gay Nightclub: గే నైట్ క్లబ్‭లో కాల్పులు.. ఐదుగురు మృతి, 18 మందికి గాయాలు

పేరుకు తగ్గట్టుగానే ఈ క్లబ్ స్వలింగ సంపర్కుల కోసం ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఈ క్లబ్‭లో నవంబర్ 20న ప్రతి ఏటా స్వలింగ సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జరిగిన కార్యక్రమంలోనే తాజా ఘటన జరిగింది. కాగా దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా అనేక మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు

Gay Nightclub: గే నైట్ క్లబ్‭లో కాల్పులు.. ఐదుగురు మృతి, 18 మందికి గాయాలు

5 killed, 18 injured in shooting at gay nightclub in US

Updated On : November 20, 2022 / 8:57 PM IST

Gay Nightclub: అమెరికాలోని ఓ దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పులతో ఐదుగురు మరణించగా, 18 మంది గాయపడ్డారు. కొలరడో స్ప్రింగ్స్‭లోని గే నైట్ క్లబ్‭లో జరిగిందీ ఘటన. క్లబ్‭లోకి ఆయుధంతో వచ్చిన దుండగుడు, కనిపించిన వారిపై బుల్లెట్ల వర్షం కురిపించాడని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అంతే కాకుండా, ఈ దారుణానికి పాల్పడ్డ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పేరుకు తగ్గట్టుగానే ఈ క్లబ్ స్వలింగ సంపర్కుల కోసం ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఈ క్లబ్‭లో నవంబర్ 20న ప్రతి ఏటా స్వలింగ సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జరిగిన కార్యక్రమంలోనే తాజా ఘటన జరిగింది. కాగా దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా అనేక మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ సమాజంపై జరిగిన ద్వేషపూరిత దాడిగా స్వలింగ సంపర్కులు పేర్కొన్నారు. మరోవైపు పోలీసులు ఈ ఘటన వెనుక కారణాలు, ఆయుధ వివరాల వంటి సమాచారం వెల్లడించలేదు. గతంలోనూ ఓర్లాండోలోని ఓ స్వలింగ సంపర్కుల నైట్ క్లబ్‭లో కల్పులు జరిగాయి. ఆ సమయంలో 49 మంది మృతి చెందారు.

Man Barks: రేషన్ కార్డులో తన పేరు మార్చాలంటూ కుక్కలా మొరుగుతూ అధికారులకు మొరపెట్టుకున్నాడు