Ganja Seized In Bhadrachalam : భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత..విలువ రూ.కోటి పైనే
భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. కార్లలో గంజాయి తరలిస్తూ స్మగ్లర్లు పట్టుబడ్డారు. రెండు కార్లలో 594 కేజీల గంజాయిని తరలిస్తుండగా.. భద్రాచలం ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యారు.

Ganja Seized In Bhadrachalam
Ganja Seized In Bhadrachalam : తెలంగాణలో గంజాయి అక్రమ రవాణాను ఎంత కట్టడి చేస్తున్నా స్మగ్లర్లు తరలిస్తున్నారు. తాజాగా భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. కార్లలో గంజాయి తరలిస్తూ స్మగ్లర్లు పట్టుబడ్డారు. రెండు కార్లలో 594 కేజీల గంజాయిని తరలిస్తుండగా.. భద్రాచలం ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యారు.
Cannabis Smuggling : విజయనగరం జిల్లాలో పుష్ప మూవీ సీన్.. ఆయిల్ ట్యాంకర్ లో అక్రమంగా గంజాయి తరలింపు
రెండు కార్లలో గంజాయి తరలిస్తూ ముగ్గురు కనిపించారని..ఇద్దరు గంజాయి స్మగ్లర్లు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన గంజాయి విలువ కోటి రూపాయలపైనే ఉంటుందని భద్రాచలం పోలీసులు అంటున్నారు.