ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది దుర్మరణం

కంటైనర్ డ్రైవర్, కారు డ్రైవర్ సహా కారులోని ముగ్గురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు.

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది దుర్మరణం

Road Accidents (Photo Credit : Google)

Updated On : August 26, 2024 / 10:53 PM IST

Road Accidents : ఏపీలో రహదారులు మరోసారి రక్తమోడాయి. వేర్వేరు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ దుర్ఘటనల్లో మొత్తం 8 మంది మరణించారు. అన్నమయ్య జిల్లా గువ్వల చెరువు ఘాట్ రోడ్ లో కారుని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. కంటైనర్ డ్రైవర్, కారు డ్రైవర్ సహా కారులోని ముగ్గురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు.

కారు కడప నుండి రాయచోటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దువ్వూరు మండలం బయనపల్లి వద్ద జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారులోని ప్రయాణికులను కుప్పం మండలం చక్రాయపేటకు చెందిన వారిగా గుర్తించారు. మృతులను వెంకటమ్మ, నాగలక్ష్మి, నాగయ్యలుగా కనుగొన్నారు.

అటు కర్నూలు నుండి పాప వెంట్రుకలు తీయించేందుకు తిరుపతికి వెళుతున్న తుఫాను వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ పాపను మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అటు అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు అనంతరాజుపేట వద్ద బైక్ ను బొలేరో వాహనం ఢీకొట్టింది. ఒకరు మృతి చెందారు. ఇద్దరికి గాయాలయ్యాయి. మృతురాలని వెంకటలక్ష్మి (18) గా గుర్తించారు. శకుంతల (19), చెంచయ్య(20) గాయపడ్డారు.

Also Read : దొంగలకే కోచింగ్ ఇచ్చే గజదొంగ.. చోరకళా నిపుణుడు.. ఫ్రమ్ సిద్దిపేట జిల్లా