Bus-Truck Collision: ఉత్తర ప్రదేశ్‌లో బస్సు-ట్రక్కు ఢీ.. ఎనిమిది మంది మృతి.. 25 మందికిపైగా గాయాలు

ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు-మినీ ట్రక్కు ఢీకొన్న ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Bus-Truck Collision: ఉత్తర ప్రదేశ్‌లో బస్సు-ట్రక్కు ఢీ.. ఎనిమిది మంది మృతి.. 25 మందికిపైగా గాయాలు

Updated On : September 28, 2022 / 11:57 AM IST

Bus-Truck Collision: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు-మినీ ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన లఖీంపూర్ ఖేరి జిల్లా, ఇసానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎరా బ్రిడ్జి సమీపంలో బుధవారం జరిగింది.

Mahesh Babu Mother Funeral: మహాప్రస్థానంలో మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అంత్యక్రియలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ప్రైవేటు బస్సు-మినీ ట్రక్కు దౌరేహ్రా నుంచి లక్నో వెళ్తుండగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికిపైగా గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు కొందరిని లక్నోలోని ఆస్పత్రులకు తరలించినట్లు జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్ సంజయ్ కుమార్ తెలిపారు.

Mahesh Babu: అమ్మ చేతి కాఫీ.. దేవుడి ప్రసాదంతో సమానమన్న మహేశ్ బాబు

ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.