Strange Murder In Khammam : బైక్‌పై లిఫ్ట్ ఇస్తే ప్రాణం తీశాడు.. ఇంజెక్షన్ గుచ్చి హత్య చేసిన దుండగుడు
సినిమాల్లోని ఘటనలు కొన్నిసార్లు నిజజీవితంలోనూ జరుగుతుంటాయి. డిటెక్టివ్ సినిమాలో జరిగినట్టుగానే..ఒక్క ఇంజక్షన్‌తో ఖమ్మంలో హత్య జరగడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. మంచికి పోతే చెడు ఎదురయిన తరహాలో...అడిగిన వ్యక్తికి పోనీలే అని లిఫ్ట్ ఇవ్వడమే షేక్ జమాల్ సాహెబ్‌కు పాపం అయింది. అదే ఆయన ప్రాణం తీసింది.

Strange murder in Khammam
Strange Murder In Khammam : సినిమాల్లోని ఘటనలు కొన్నిసార్లు నిజజీవితంలోనూ జరుగుతుంటాయి. డిటెక్టివ్ సినిమాలో జరిగినట్టుగానే..ఒక్క ఇంజక్షన్‌తో ఖమ్మంలో హత్య జరగడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. మంచికి పోతే చెడు ఎదురయిన తరహాలో…అడిగిన వ్యక్తికి పోనీలే అని లిఫ్ట్ ఇవ్వడమే షేక్ జమాల్ సాహెబ్‌కు పాపం అయింది. అదే ఆయన ప్రాణం తీసింది. బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి ప్రాణాలు కోల్పోయాడు. 55ఏళ్ల షేక్ జమాల్ సాహెబ్‌ది ముదిగొండ మండలంలోని బొప్పారం గ్రామం. ఆయన కూతురు ఏపీలోని గండ్రాయి గ్రామంలో నివసిస్తున్నారు. అయితే కుమార్తెను చూసేందుకు జమాల్ బైక్‌పై వల్లభి మీదగా గండ్రాయి వెళ్తున్నారు. మార్గమధ్యంలో జమాల్‌ను గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగాడు.
అప్పటికే అతను మంకీ క్యాప్ ధరించి ఉన్నాడు. అయినా జమాల్‌కు ఏమీ అనుమానం రాలేదు. ఎవరో ఎక్కడికో వెళ్లడానికి లిఫ్ట్ అడుగుతున్నాడననుకుని తన వాహనంపై ఎక్కించుకున్నారు. బైక్ బాణాపురం గ్రామం దాటిన తర్వాత వల్లభి దగ్గర జమాల్‌కు వెనకనుంచి అపరిచితుడు ఇంజక్షన్ ఇచ్చాడు. ఏదో ఇంజక్షన్ గుచ్చుకోవడంతో జమాల్ వెంటనే బైక్ ఆపారు. ఇదే అదనుగా నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. జమాల్ తన భార్యకు ఫోన్ చేసి విషయం చెప్పి స్పృహ కోల్పోయారు. స్థానికులు ఆయన్ను 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా …మార్గమధ్యంలోనే చనిపోయారు.
Man Killed In Hyderabad : హైదరాబాద్ సైదాబాద్ లో వ్యక్తి దారుణ హత్య
ఘటనాస్థలంలో ఇంజెక్షన్, సిరంజిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జమాల్ మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అసలీ హత్య జరిగిన విధానం అందరినీ నివ్వెరపరిచింది. ఓ చిన్న ఇంజక్షన్‌తో ఇంత తేలిగ్గా నిండు ప్రాణాలు తీయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాహనాన్ని దొంగలించాలనే ఉద్దేశంతోనే ఆ వ్యక్తి బైక్‌పై ఎక్కాడా లేక..మరేదైనా కారణముందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. బైక్ ఎక్కిన వ్యక్తి జమాల్‌కు తెలిసిన వ్యక్తా లేకా అపరిచితుడా అన్నదానిపైనా స్పష్టత లేదు.
సూదితో జమాల్‌ను పొడవాలన్నది…ఆ ఒక్క దుండగుని ఆలోచనేనా..లేక దీనివెనక ఎవరన్నా ఉన్నారా అన్నది దర్యాప్తులో తేలనుంది. ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా దుండగుడితో జమాల్‌పై దాడి చేయించారా అన్న కోణంలోనూ విచారణ సాగనుంది. ఈ తరహా ఘటనలు ఇటీవలి కాలంలో వినలేదు. లిఫ్ట్ ఇచ్చి …యువకుడు ప్రాణాలు పోగొట్టుకోవడం అందరిలో భయాందోళన కలిగిస్తుందన్నది నిజం. ఈ ఘటన తెలిస్తే….అసలు వాహనదారులు ఎవరికన్నా లిఫ్ట్ ఇవ్వడానికే భయపడాతరనడంలో సందేహం లేదు.
ఇంజెక్షన్ గుచ్చుకోవడంతో జమాల్ బైక్ ఆపేశాడని, వెంటనే నిందితుడు పారిపోయాడని పోలీసులు చెప్పారు. స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆస్పత్రికి తీసుకొచ్చేటప్పటికే జమాల్ శరీరం చికిత్సకు స్పందించలేని స్థితిలో ఉందని వైద్యులు చెప్పారు. ఇంజెక్షన్‌లో ఏముందన్నది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లోనే తేలుతుందన్నారు. జమాల్ చాలా మంచి వ్యక్తని, ఆయనకు ఎవరితో గొడవలు లేవని బొప్పారం గ్రామస్థులంటున్నారు. ఆయన్ను ఎవరైనా హత్య చేశారంటే నమ్మలేకపోతున్నామన్నారు.