మరో పోలీస్ దొరికిపోయాడు: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హయత్‌నగర్ డీఐ

హైదరాబాద్: అవినీతి సొమ్ముకి రుచిమరిగిన మరో ప్రభుత్వ అధికారి అడ్డంగా దొరికిపోయాడు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. హయత్ నగర్ డీఐ(డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్)

  • Published By: veegamteam ,Published On : February 25, 2019 / 10:56 AM IST
మరో పోలీస్ దొరికిపోయాడు: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హయత్‌నగర్ డీఐ

Updated On : February 25, 2019 / 10:56 AM IST

హైదరాబాద్: అవినీతి సొమ్ముకి రుచిమరిగిన మరో ప్రభుత్వ అధికారి అడ్డంగా దొరికిపోయాడు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. హయత్ నగర్ డీఐ(డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్)

హైదరాబాద్: అవినీతి సొమ్ముకి రుచిమరిగిన మరో ప్రభుత్వ అధికారి అడ్డంగా దొరికిపోయాడు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. హయత్ నగర్ డీఐ(డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్) జితేందర్ రెడ్డి ఏసీబీకి చిక్కాడు. రూ.30వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హయత్ నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న జితేందర్ రెడ్డి ఓ చోరీ కేసులో అనుమానితుడిని తప్పించేందుకు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పథకం ప్రకారం డీఐ జితేందర్ రెడ్డిని పట్టుకున్నారు. లంచం తీసుకుంటున్న వ్యవహారాన్ని షూట్ చేశారు.

బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే ఇలా అన్యాయం చేస్తూ దొరికిపోవడం చర్చకు దారితీసింది. అవినీతిపరులను శిక్షించాల్సిన ఖాకీలే ఇలా కర్షషన్ కింగ్స్‌గా మారుతుండటం విస్మయం కలిగిస్తోంది. 2 వారాల వ్యవధిలో పలువురు పోలీసులు ఇలా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని రోజుల క్రితం సైబరాబాద్ సబ్‌ఇన్‌స్పెక్టర్ రూ.2వేలు, మహేశ్వరం ఇన్‌స్పెక్టర్ రూ.80వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. నీతికి, నిజాయతీకి పోలీస్ డిపార్ట్‌మెంట్ కేరాఫ్‌గా చెబుతారు. అలాంటి డిపార్ట్‌మెంటుకు చెందిన వ్యక్తులు ఇలా అవినీతి సొమ్ముకి రుచి మరిగి ఏసీబీ ట్రాప్‌లో పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల్లో డిపార్ట్‌మెంట్‌పై నమ్మకం పోయేలా చేస్తోంది.