మైనర్ రేప్ కేసులో నిందితుడు అరెస్టు

  • Published By: chvmurthy ,Published On : January 14, 2019 / 04:04 PM IST
మైనర్ రేప్ కేసులో నిందితుడు అరెస్టు

హైదరాబాద్:  పాతబస్తీలోని కాలాపత్తర్ పోలీసు స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక పై అత్యాచారం కేసులో నాలుగో నిందితుడు విజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈకేసులో  ప్రధాననిందితుడు విజయ్ ను పోలీసులు ప్రత్యక్ష సాక్షిగా చూపటంపై బాధితురాలి కుటుంబీకులు  ఆదివారం పోలీసు స్టేషన్ ముందు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న హోం మంత్రి మహుమ్మద్ ఆలీ  పోలీసు కమీషనర్ అనురాగ్ శర్మను అడిగి  వివరాలు తెలుసుకుని కేసు వేగంగా విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో దిగివచ్చిన పోలీసులు విజయ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.