భూకబ్జా కేసులో ఏపీ డీజీపీకి హైకోర్టులో చుక్కెదురు

  • Published By: chvmurthy ,Published On : March 5, 2019 / 02:08 PM IST
భూకబ్జా కేసులో ఏపీ డీజీపీకి హైకోర్టులో చుక్కెదురు

Updated On : March 5, 2019 / 2:08 PM IST

హైదరాబాద్: పార్క్ స్ధలం కబ్జా చేసిన కేసులో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కు హై కోర్టులో చుక్కెదురయ్యింది. హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లో పార్క్ స్ధలాన్ని  కబ్జాచేసి నిర్మాణాలు  చేపట్టారనే ఆరోపణతో జీహెచ్ ఎంసీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసారు.  దీంతో డీజీపీ కోర్టును ఆశ్రయించారు. అక్రమనిర్మాణాలు తొలగించామని డీజీపీ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఇంటి నిర్మాణం కూడా అక్రమమేనని జీహెచ్ఎంసీ అధికారులు తెలుపగా, దీన్ని పరిగణలోకి తీసుకున్నన్యాయస్ధానం వివరణ కోరింది. రెండు వారాలు గడువు కావాలని  డీజీపీ తరుఫు న్యాయవాది కోర్టును కోరగా అందుకు కోర్టు నిరాకరించింది. ఈనెల 11 లోగా అక్రమ ఇంటి నిర్మాణంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.