Road Accident: ఇస్నాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టిప్పర్, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు

Road Accident: ఇస్నాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

Road

Updated On : January 6, 2022 / 8:24 AM IST

Road Accident: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టిప్పర్, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పఠాన్ చెరు పోలీసులు తెలిపిన వివరాలు మేరకు… పఠాన్ చెరు మండల పరిధిలోని హైవేపై.. ఇస్నాపూర్ వద్ద అతివేగంతో వెళుతున్న ఆటో అదుపుతప్పి రోడ్డు ఆవలివైపు వెళ్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టింది. ప్రమాద ధాటికి ఆటో నుజ్జునుజ్జయింది. ఈఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇస్నాపూర్లోని స్థానిక పెట్రోల్ బంక్ ఎదురుగా ఈప్రమాదం సంభవించింది.

Also read: Corona Rising: ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఓమిక్రాన్, ఆంక్షల దిశగా పలు దేశాలు

ప్రమాదంపై వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన ముగ్గురిని, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ప్రమాద సమయంలో రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న మరొకరికి గాయాలు అయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పఠాన్ చెరు పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని సమీక్షించారు. మృతుల్లో ఇద్దరు పఠాన్ చెరులోని తోషిబా కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న తిరుమలవాసు(34), ఆటో డ్రైవర్ సాయి బన్నన్(27),గా గుర్తించిన పోలీసులు మరొకరి వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేస్తి దర్యాప్తు చేస్తున్నారు.

Also read: Peacock Dead : చనిపోయిన నెమలిని పూడ్చేందుకు తీసుకెళ్తున్న వారి వెంటే వెళ్లిన మరో నెమలి