Secunderabad Riots Case : సికింద్రాబాద్ అల్లర్ల కేసులో 16 మంది నిందితులకు బెయిల్ మంజూరు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పధకాన్నివ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి అరెస్టైన 16 మంది నిందితులకు బెయిల్ మంజూరయ్యింది. నిందితులకు పరీక్షలు ఉండటంతో రైల్వే కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Secunderabad Riots Case :  సికింద్రాబాద్ అల్లర్ల కేసులో 16 మంది నిందితులకు బెయిల్ మంజూరు

Secunderabad Riots Case

Updated On : August 1, 2022 / 4:00 PM IST

Secunderabad Riots Case :  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పధకాన్నివ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి అరెస్టైన 16 మంది నిందితులకు బెయిల్ మంజూరయ్యింది. నిందితులకు పరీక్షలు ఉండటంతో రైల్వే కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఏ1 నుంచి ఏ10 వరకు ఉన్ననిందుతులకు బెయిల్ మంజురు చేయలేదు. ఈకేసులో మొత్తం 63 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు బెయిల్ పిటీషన్ ను రైల్వే కోర్టు తోసి పుచ్చింది. దీంతో సుబ్బారావు హైకోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతంసుబ్బారావు బెయిల్ పిటీషన్ పెండింగ్ లో ఉంది.