IIT స్టూడెంట్ కేడీ వేషాలు : అపార్ట్ మెంట్ లోని అన్ని బాత్రూమ్స్ లో సెల్ ఫోన్లు

IIT స్టూడెంట్ కేడీ వేషాలు : అపార్ట్ మెంట్ లోని అన్ని బాత్రూమ్స్ లో సెల్ ఫోన్లు

Updated On : February 25, 2019 / 9:14 AM IST

పేరుకే ఉన్నత చదువులు.. మనుషులకు మాత్రం వంకర బుద్ధులు. 34ఏళ్ల ఐఐటీ ముంబై స్టూడెంట్ చేసిన నిర్వాకం వింటే తిట్టుకోకుండా ఉండరు. స్నానాల గదిలో.. మహిళలు ఏకాంతంగా ఉన్న సమయాల్లో వీడియోలు చిత్రీకరిస్తూ పట్టుబడ్డాడు. ముంబైలోని థానే నివాసి అయిన అవినాశ్ కుమార్ యాదవ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. 34 ఏళ్ల IIT స్టూడెంట్ ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. అదే బిల్డింగ్‌ లోని ప్రతి ప్లాట్ లోని బాత్రూం దగ్గర సెల్ ఫోన్లు పెట్టేవాడు. వాటికి ఆటోమేటిక్ రికార్డింగ్ సిస్టమ్ అమర్చేవాడు. యాప్ ద్వారా ఆపరేట్ చేస్తుండేవాడు. కొన్నిసార్లు అప్పటికప్పుడు సెల్ ఫోన్ పెట్టి.. 10 నిమిషాల తర్వాత తీసుకెళుతుండేవాడు. కొన్ని నెలలుగా ఈ తతంగాన్ని సాగిస్తున్నాడు. ఎవరికీ అనుమానం కూడా రాలేదు. అయితే ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం ఓ మహిళ స్నానం చేస్తుండగా ఆమెకు ఏదో వస్తువు ఉన్నట్లు గుర్తించింది. బాత్రూమ్ బయటకు వచ్చి చూస్తే అది సెల్ ఫోన్. అంతే షాక్ అయ్యింది. వీడియో రికార్డింగ్ అవుతున్నట్లు గుర్తించింది. భయానికి గురై ఆ మహిళ.. విషయాన్ని భర్తకు చెప్పింది. ఆ పక్కనే.. ఓ యువకుడు అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. అతనిపై అనుమానం వ్చి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. షాక్.. ఈ ఒక్కటే కాదు.. కొన్ని వందల సంఖ్యలో అతని ఫోన్ లో వీడియోలు ఉన్నాయి. అపార్ట్ మెంట్ లోని ప్రతి బాత్రూమ్ దగ్గర సెల్ ఫోన్లు పెట్టటం, రికార్డ్ చేయటం కొన్నాళ్లు చేస్తూ వస్తున్నట్లు గుర్తించారు. ఆ ఫోన్‌లో చాలా మంది వీడియోలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. చాలా వరకూ ఆ బిల్డింగ్ లోని స్నానాల గది వీడియోలు మొబైల్‌ ఫోన్‌లో కనిపించాయని కపూర్‌బావ్‌డీ పోలీసులు వెల్లడించారు. 

మహిళల భద్రత, విలువల క్రమంలో బిల్డింగ్ పేరుతోపాటు IIT స్టూడెంట్ పేరు, వివరాలు ప్రకటించటానికి నిరాకరించారు పోలీసులు. అందరూ ఉన్నత వర్గాలకు చెందిన వారు కావటంతో ముంబైలో ఈ విషయం కలకలం రేపుతోంది.