Meesho: డ్రోన్ కెమెరా ఆర్డర్ చేస్తే కిలో బంగాళదుంపలు డెలివరీ అయ్యాయి
ప్రాడక్టర్ ఆర్డర్ చేసేటప్పుడే పూర్తి పేమెంట్ చేశానని చేతన్ కుమార్ తెలిపాడు. కాగా, ఈ డెలివరీని తెరుస్తుండగా వీడియో తీశారు. ఆన్లైన్ మోసాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విషయమై తమకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు రాలేదని పర్వాల్పూర్ పోలీసులు పేర్కొన్నారు.

Bihar Man Orders Drone Camera From Online Shopping Site, Receives Potatoes Instead
Meesho: ఆన్లైన్ కొనుగోళ్ల గోల్మాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొబైల్ ఫోన్లు ఆర్డర్ చేస్తే అప్పుడప్పుడు సబ్బు బిళ్లలు, ఇటుక పెల్లలు వస్తుంటాయి. చిన్నా చితకా ఆన్లైన్ సంస్థలే కాకుండా పెద్ద సంస్థల్లో కూడా ఇలా జరుగుతుంటాయి. ఇక తాజాగా, బిహార్లో ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. ఒక వ్యక్తి డ్రోన్ కెమెరా ఆర్డర్ చేయగా.. అతడికి కిలో బంగాళదుంపలు డెలివరీ అయ్యాయి. ‘మీషో’ అనే ఆన్లైన్ సంస్థ ఘనకార్యం ఇది.
బిహార్లోని నలందకు సమీపంలో ఉన్న పర్వాల్పూర్ అనే గ్రామానికి చెందిన చేతన్ కుమార్ అనే వ్యక్తి మీషో అనే సంస్థలో డ్రోన్ కెమెరా ఆర్డర్ చేశాడు. తీరా ఆ ఆర్డర్ డెలివరీ అయింది. ప్యాకేజీ చూస్తే కాస్త అనుమానంగా అనిపించి డెలివరీ బాయ్ చేతనే ఓపెన్ చేయించారు. వారి అనుమానాన్ని నిజం చేస్తూ డ్రోన్ కెమెరాకు బదులు కిలో బంగళాదుంపలు బయట పడ్డాయి. ఫ్రాడ్ గురించి డెలివరీ బాయ్ ఒప్పుకున్నాడు. అయితే ఈ ఫ్రాడ్తో డెలివరీ కంపెనీకి సంబంధం ఉందా లేదా అనే విషయం తనకు తెలియదని పేర్కొన్నాడు.
ऑनलाइन शॉपिंग करना पड़ा महँगा, युवक ने मंगाया ड्रोन, निकला आलू | Unseen India
पूरा वीडियो- https://t.co/KxZ0RsZwUl pic.twitter.com/s81XVfE5Vb
— UnSeen India (@USIndia_) September 26, 2022