Blade Batch : విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం

విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ సభ్యుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఆదివారం రాత్రి  చిట్టి నగర్ సొరంగం రోడ్డులో ఒక బార్ లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు.

Blade Batch : విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం

Blade Batch

Updated On : October 11, 2021 / 10:13 AM IST

Blade Batch :  విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ సభ్యుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఆదివారం రాత్రి  చిట్టి నగర్ సొరంగం రోడ్డులో ఒక బార్ లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు.
బార్‌లో మద్యం సేవించి అనంతరం బార్ అద్దాలు పగలగొట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి ఒక బ్లేడ్ బ్యాచ్ సభ్యుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఆ సభ్యుడు మద్యం మత్తులో రోడ్డు పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాన్ని తన తలతో బలంగా గుద్దుకోవడంతో గాయాలపాలయ్యాడు…. ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ప్రతిరోజు సొరంగం మార్గంలో బ్లేడ్ బ్యాచ్, రౌడీషీటర్ల ఆగడాలు జరుగుతూనే ఉంటాయని వీరి ఆగడాలను పోలీసులు నియంత్రించలేకపోతున్నారని స్థానికులు  ఆరోపిస్తున్నారు.