జమ్మూ బస్టాండ్‌లో బాంబు పేలుడు

  • Published By: venkaiahnaidu ,Published On : March 7, 2019 / 07:05 AM IST
జమ్మూ బస్టాండ్‌లో బాంబు పేలుడు

Updated On : March 7, 2019 / 7:05 AM IST

జమ్మూ బస్టాండ్ లో బాంబు పేలుడు జరిగింది. పేలుడులో ఐదుగురికి గాయాలయ్యాయి. గురువారం(మార్చి-7,2019) మధ్యాహ్నాం 12గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. పేలుడు ఘటనపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ముషార్రఫ్ సంచలన నిజాలు : జైషే,ISIలు కలిసి భారత్ లో ఉగ్రదాడులు చేశాయి

పేలుడులో వాడిన పదార్థాలు ఏంటీ, పేలుడుకు ఏ విధమైన బాంబులు ఉపయోగించారన్నది ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.ఈ పేలుడి కుట్ర వెనుకు ఉన్నది ఎవరన్నదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. బస్టాండ్ ప్రాంతాన్ని సీజ్ చేశారు. బాంబు పేలుడు ఘటనపై కేంద్ర హోంశాఖ అధికారులతో జమ్మూ పోలీసులు మాట్లాడారు. ఘటనపై పూర్తి వివరాలను అందించాలని కేంద్రహోంశాఖ కోరింది.
Also Read: పుల్వామాలో ఎన్‌కౌంటర్ : ఇంటిని పేల్చేసి ఉగ్రవాదిని మట్టుబెట్టారు