Bomb Threat Iranian Flight : ఇరాన్‌ విమానానికి బాంబు బెదిరింపు

ఇరాన్‌ నుంచి చైనాకు వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. సోమవారం ఉదయం విమానం భారత భూ భాగంలో ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు వచ్చింది. దీంతో వెంటనే విమానాన్ని న్యూఢిల్లీలో ల్యాండ్‌ చేసేందుకు అనుమతి కోరగా.. జైపూర్‌ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ చేయాలని ఢిల్లీ ఏటీసీ సూచించింది. 

Bomb Threat Iranian Flight : ఇరాన్‌ విమానానికి బాంబు బెదిరింపు

bomb threat flight

Updated On : October 3, 2022 / 1:07 PM IST

Bomb Threat Iranian Flight : ఇరాన్‌ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఇరాన్‌ నుంచి చైనాకు వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. సోమవారం ఉదయం విమానం భారత భూ భాగంలో ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు వచ్చింది. దీంతో వెంటనే విమానాన్ని న్యూఢిల్లీలో ల్యాండ్‌ చేసేందుకు అనుమతి కోరగా.. జైపూర్‌ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ చేయాలని ఢిల్లీ ఏటీసీ సూచించింది.  ఆ తర్వాత సమాచారం అందుకున్న భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ఆ విమానాన్ని అనుసరించాయి.

ఏటీసీ ఢిల్లీలో అనుమతించకపోవడంతో పైలట్‌ విమానాన్ని చైనా గగనతలం దిశగా మళ్లించారు. ప్రస్తుతం భద్రతా సంస్థలు విమానాన్ని పర్యవేక్షిస్తున్నాయి. సదరు విమానం ఇరాన్‌లోని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్వాంగ్‌జౌకు వెళ్తున్నట్లు ఢిల్లీ ఏటీసీ వర్గాలు తెలిపాయి. బాంబు బెదిరింపు సమాచారం తెలుసుకున్న విమానయాన సంస్థ ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ చేయాలని సూచించింది.

Bullet Hit Flight : గాలిలో ఎగురుతున్న విమానంలోకి చొచ్చుకెళ్లిన బుల్లెట్‌.. తర్వాత ఎమైందో తెలుసా!

ఆ తర్వాత ఢిల్లీ ఏటీసీని సంప్రదించగా.. ఏటీసీ జైపూర్‌కు వెళ్లాలని సూచించింది. అనంతరం పైలట్‌ భారత గగనతలం నుంచి విమానాన్ని మళ్లించాడు.  విమానంలో బాంబు ఉన్నట్లు సమాచారం అందిన వెంటనే భారత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. భారత వైమానిక దళం అప్రమత్తమై.. రెండు విమానాలను ఇరాన్‌ విమానం వెనుక పంపారు. అయితే, ఇప్పటివరకు విమానంలో బాంబు ఉన్నట్లు నిర్ధారణ కాకపోవడం గమనార్హం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.