Bullet Hit Flight : గాలిలో ఎగురుతున్న విమానంలోకి చొచ్చుకెళ్లిన బుల్లెట్‌.. తర్వాత ఎమైందో తెలుసా!

గాలిలో ఎగురుతన్న విమానంలోకి ఒక బుల్లెట్‌ చొచ్చుకెళ్లింది. ఆ బుల్లెట్‌ ఒక ప్రయాణికుడికి తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మయన్మార్‌లో చోటు చేసుకుంది. మయన్మార్ నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం లోయికావ్ ఎయిర్‌పోర్ట్‌కు నాలుగు మైళ్ల దూరంలో 3,500 అడుగుల ఎత్తులో ఎగురుతోంది. ఇంతలో ఒక బుల్లెట్‌ విమానం కింది భాగం నుంచి లోపలకు చొచ్చుకొని వచ్చింది.

Bullet Hit Flight : గాలిలో ఎగురుతున్న విమానంలోకి చొచ్చుకెళ్లిన బుల్లెట్‌.. తర్వాత ఎమైందో తెలుసా!

Bullet Hit Flight (1)

Bullet Hit Flight : గాలిలో ఎగురుతన్న విమానంలోకి ఒక బుల్లెట్‌ చొచ్చుకెళ్లింది. ఆ బుల్లెట్‌ ఒక ప్రయాణికుడికి తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మయన్మార్‌లో చోటు చేసుకుంది. మయన్మార్ నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం లోయికావ్ ఎయిర్‌పోర్ట్‌కు నాలుగు మైళ్ల దూరంలో 3,500 అడుగుల ఎత్తులో ఎగురుతోంది. ఇంతలో ఒక బుల్లెట్‌ విమానం కింది భాగం నుంచి లోపలకు చొచ్చుకొని వచ్చింది. అందులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి శరీరంలోకి బుల్లెట్ దిగింది.

లోయికావ్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్‌ అయిన వెంటనే గాయపడిన ప్రయాణికుడ్ని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ నగరానికి వచ్చే అన్ని విమానాలను మయన్మార్ నేషనల్ ఎయిర్‌లైన్స్ నిరవధికంగా రద్దు చేసింది. కాగా, కయాహ్ రాష్ట్రంలోని తిరుగుబాటు దళాలు ఆ విమానంపై కాల్పులు జరిపాయని మయన్మార్ మిలటరీ ప్రభుత్వం ఆరోపించింది.

Aircraft Emits Sparks: గాల్లో విమానం నుంచి ఎగసిపడ్డ నిప్పురవ్వలు.. అయినా సేఫ్‌గానే ల్యాండింగ్.. వీడియోలో రికార్డు

ప్రయాణికుల విమానంపై ఈ రకమైన దాడి యుద్ధ నేరమని మయన్మార్ పాలక మిలిటరీ కౌన్సిల్ ప్రతినిధి మేజర్ జనరల్ జా మిన్ తున్ పేర్కొన్నారు. శాంతి కోరుకునే వ్యక్తులు, సంస్థలు దీనిని అన్ని విధాలుగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు తిరుగుబాటు దళాలు ఈ ఆరోపణలను ఖండించాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.