బార్ లో మత్తులో తండ్రి.. కొడుకు కిడ్నాప్! 

మద్యం తాగిన తండ్రి బార్ లో నిద్రపోతుంటే.. బయట నిల్చొన్న ఐదేళ్ల కొడుకుని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన చెన్నైలోని తస్మాక్ బార్ లో వెలుగుచూసింది.

  • Published By: sreehari ,Published On : January 4, 2019 / 06:28 AM IST
బార్ లో మత్తులో తండ్రి.. కొడుకు కిడ్నాప్! 

మద్యం తాగిన తండ్రి బార్ లో నిద్రపోతుంటే.. బయట నిల్చొన్న ఐదేళ్ల కొడుకుని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన చెన్నైలోని తస్మాక్ బార్ లో వెలుగుచూసింది.

మద్యం తాగిన తండ్రి బార్ లో నిద్రపోతుంటే.. బయట నిల్చొన్న ఐదేళ్ల కొడుకుని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన చెన్నైలోని తస్మాక్ బార్ లో వెలుగుచూసింది. గురుప్రసాద్ (35) అనే వ్యక్తి తన కుమారుడితో కలిసి అంబటూర్ ప్రాంతంలోని బార్ లోకి వెళ్లాడు. అక్కడ ఫుల్ గా మందు కొట్టేసి అక్కడే నిద్రపోయాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి పిల్లవాడికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు.

ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కిడ్నాప్ ఘటనను ఛేదించారు. మరుసటి రోజున కుర్రాడు చెప్పిన వివరాలతో తండ్రి గురుప్రసాద్ దగ్గరకు పిల్లాడిని తీసుకొని అప్పగించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.