పిలవకుండా వచ్చారని లొల్లి: పెళ్లికొడుకు హతం

  • Published By: madhu ,Published On : December 22, 2019 / 06:51 AM IST
పిలవకుండా వచ్చారని లొల్లి: పెళ్లికొడుకు హతం

Updated On : December 22, 2019 / 6:51 AM IST

పిలవని పేరంటానికి వెళితే ఏమవుతుంది.. ఆ ఏముంది.. గుర్తించి.. మందలించి బయటకు పంపేస్తారు. కానీ కొంతమంది పెళ్ళిళ్లలో ఫ్రీగా భోజనాలు చేసే వారు చాలా మందే ఉంటారు. కొంతమంది పెళ్లి నిర్వాహకులు చూసీ చూడనట్లుగా ఉండి వదిలేస్తుంటారు. కానీ ఓ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. పిలవని పెళ్లికి వచ్చిన వారితో గొడవపడిన పెళ్లికొడుకు మృతి చెందాడు. ఈ విషాద ఘటన కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. 

జోయి మెల్గోజా, ఓ యువతితో  పెళ్లి జరిగింది. వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. అందరూ ఆనందంగా సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈ తరుణంలో రోనీ, అతని సోదరుడు జోస్యూలు వెళ్లారు. ఎలాంటి ఆహ్వానం లేకుండానే వీరు రిసెప్షన్‌కు అటెండ్ అయ్యారు. వీరిని కుటుంబసభ్యులు గుర్తు పెట్టారు. పిలవని ఫంక్షన్‌కు రావొద్దని..వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.

మాట వినకుండా..గొడవకు దిగారు. పెళ్లి కొడుకు జోక్యం చేసుకుని వారిద్దరినీ అక్కడి నుంచి పంపించి వేశాడు. అవమానంతో రోనీ, జోస్యూలు రగిలిపోయారు. రిసెప్షన్ ముగించుకుని..జో మెల్గోజా దంపతులు వెళుతున్నారు. వెంటనే జో దంపతులపై దాడికి దిగారు. పెళ్లికొడుకును విచక్షణారహితంగా కొట్టారు. దొడ్డు కర్రలతో బాదడంతో జోకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా అతను చనిపోయాడు.

ఎంతో ఆనందంగా జీవితం గడుపుదామని అనుకున్న పెళ్లి కూతురు ఆశలపై నీళ్లు చల్లారు నిందితులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మెల్గోజా అంత్యక్రియలకు సహాయం చేయాలని GoFundMe page విజ్ఞప్తి చేసింది. కేసు దర్యాప్తు చేపడుతున్నారు. 
Read More : ఇంత దారుణమా : యువకుడిని చితక్కొట్టి..మూత్రం పోశారు