కాల్ మనీ కలకలం : కోరిక తీర్చాలంటూ ఒత్తిడి…మహిళ ఆత్మహత్యాయత్నం
గుంటూరు జిల్లాలో కాల్ మనీ కలకలం రేపింది. డబ్బులు ఇవ్వకుంటే తన కోరిక అయినా తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఒత్తిడి భరించలేని బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

గుంటూరు జిల్లాలో కాల్ మనీ కలకలం రేపింది. డబ్బులు ఇవ్వకుంటే తన కోరిక అయినా తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఒత్తిడి భరించలేని బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
గుంటూరు జిల్లాలో కాల్ మనీ కలకలం రేపింది. డబ్బులు ఇవ్వకుంటే అక్రమ కేసులు పెడతామని, తన కోరిక అయినా తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఒత్తిడి భరించలేని బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. నర్సరావుపేటలోని బరంపేటకు చెందిన అజిమున్నీసా.. గుంటూరు జిల్లా ట్రజరీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తుంది.
వినుకొండ కార్యాలయంలో పని చేస్తున్న సమయంలో ఇన్నమూరి మాధవరావు నుంచి అజిమున్నీసా మూడు లక్షలు అప్పు తీసుకుంది. బదులుగా ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఏటీఎం కార్డులను తీసుకున్నాడు మాధవరావు. అప్పటి నుండి నెలనెలా వడ్డీతో పాటు అసలు కూడా చెల్లిస్తూ ఏడున్నర లక్షల రూపాయలను చెల్లించింది.
అయినా ఇంకా చెల్లించాలంటూ ఆమెను వేధించాడు. డబ్బులు ఇవ్వకుంటే అక్రమ కేసులు పెడతామని, తన కోరిక అయినా తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఒత్తిడి భరించలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు స్పందించక పోవడంతో ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు వచ్చి.. నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన సిబ్బంది.. గుంటూరు జీజీహెచ్ కు తరలించారు.
మాధవరావు తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని… అందుకే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధితురాలు చెబుతోంది. తీసుకున్న అప్పుతో పాటు కోరిక కూడా తీర్చాలంటూ తనను వేధిస్తున్నాడని చెబుతోంది.