పట్టపగలే లక్షలు లూటీ: ఏటీఎం క్యాష్ వెహిక‌ల్‌పై కాల్పులు 

అదో బిజీ మార్కెట్.. సరిగ్గా మధ్యాహ్నం 1.45 నిమిషాలు అవుతుంది. అక్కడే ఓ బ్యాంకు, దాని పక్కనే ఏటీఎం ఉంది. అదే సమయంలో బ్యాంకు క్యాష్ వెహికల్ అక్కడికి చేరుకుంది.

  • Published By: sreehari ,Published On : February 20, 2019 / 10:35 AM IST
పట్టపగలే లక్షలు లూటీ: ఏటీఎం క్యాష్ వెహిక‌ల్‌పై కాల్పులు 

అదో బిజీ మార్కెట్.. సరిగ్గా మధ్యాహ్నం 1.45 నిమిషాలు అవుతుంది. అక్కడే ఓ బ్యాంకు, దాని పక్కనే ఏటీఎం ఉంది. అదే సమయంలో బ్యాంకు క్యాష్ వెహికల్ అక్కడికి చేరుకుంది.

అదో బిజీ మార్కెట్.. సరిగ్గా మధ్యాహ్నం 1.45 నిమిషాలు అవుతుంది. అక్కడే ఓ బ్యాంకు, దాని పక్కనే ఏటీఎం ఉంది. అదే సమయంలో బ్యాంకు క్యాష్ వెహికల్ అక్కడికి చేరుకుంది. సెక్యూరిటీ గార్డులు వాహనంలో నుంచి దిగారు. డబ్బు పెట్టెల లోడ్ దించుతున్నారు. ఏటీఎంలో పెట్టడానికి క్యాష్ బాక్స్ లను తీసుకెళ్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా కాల్పులు.. ఇద్దరు మోటారు సైకిళ్లపై వచ్చి సెక్యూరిటీ గార్డులపై బుల్లెట్ల వర్షం కురిపించారు.

రెప్పపాటులో రూ.20 లక్షలు రూపాయలను కొట్టేసి పారిపోయారు. ఇలాంటి దోపిడీ సీన్లను ఎన్నోసినిమాల్లో చూసే ఉంటారు. ఢిల్లీలోని నోయిడాలో అచ్చం సినీ ఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. ఏటీఎం దగ్గరకు చేరుకున్న క్యాష్ వెహికల్ పై మోటార్ సైకిళ్లపై మాస్క్ లు ధరించి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డులు దుండగులపై ఎదురుకాల్పులు జరిపారు. మొత్తం 12 రౌండ్లు కాల్పులు జరిపారు. అయినప్పటికీ దుండగులు రూ.20 లక్షల క్యాష్ బ్యాగ్ తో ఊడాయించారు.

దుండగులను ఛేజింగ్ చేసే క్రమంలో వాగన్ ఆర్ కారు వెనుక నుంచి మోటార్ సైకిల్ ను గట్టిగా ఢీకొట్టింది. క్యాష్ బ్యాగ్ తో సహా బైక్ పై ఉన్న దొంగలు ఇద్దరు కింద పడ్డారు. బ్యాగులో డబ్బు కూడా కింద పడిపోయింది.  అందులో దాదాపు రూ. 20లక్షల 35వేలు వరకు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బైక్ నడిపిన దొంగ పారిపోగా.. వెనుక కూర్చొన్న మరో దొంగ పోలీసులకు దొరికిపోయినట్టు కేంద్రియ విహార్ 2 సొసైటీ సెక్యూరిటీ ఆఫీసర్ భాను చౌబే తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకునే లోపే కొందరు చిన్నారులు కింద పడిపోయిన రూ.500 నోట్లతో ఆడుకుంటున్నారని పోలీసులు చెప్పారు. దొరికిపోయిన దొంగ దగ్గర రూ.75వేల క్యాష్ దొరికినట్టు తెలిపారు.

వ్యాన్ లో నుంచి దొంగల కొట్టేసిన క్యాష్ బండెల్స్ డ్రైనేజీలో పడిపోయినట్టు చౌబే చెప్పారు. పోలీసులు పట్టుకున్న దుండగుడు ఉత్తరప్రదేశ్ బులందేశ్వర్ ప్రాంతానికి చెందిన నాన్హేగా పోలీసులు గుర్తించారు. అతడి దగ్గర నుంచి క్యాష్ తో పాటు రెండు దేశీయ తుపాకీలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఏటీఎం దగ్గర కాల్పులు అనంతరం పేలిన తుటాలను సేకరించి పోలీసులకు అప్పగించినట్టు ఏటీఎం సెక్యూరిటీ గార్డు ముకేశ్ కుమార్ తెలిపాడు. పారిపోయిన మరో దొంగ కోసం తీవ్రంగా గాలిస్తున్నట్టు పోలీసు ప్రతినిధి చెప్పారు.

Read Also : మా నాన్న గుర్తుకొచ్చాడు : జవాన్లకు నివాళులర్పిస్తూ రాహుల్ కంటతడి
Read Also : డెవలపర్లకు గుడ్ న్యూస్: గూగుల్ కొత్త వెబ్ డొమైన్ వచ్చేసింది