Double Murder on Delhi street : రాక్షసానందం….బైక్ ను ఢీ కొట్టారని ఇద్దర్ని పొడిచి చంపిన యువకులు

ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమబైక్ ను ఢీ కొట్టారనే కోపంతో ఇద్దరు టీనేజర్లు మరో ఇద్దరిని పిడిగుద్దులు గుద్ది, కత్తులతో పొడిచి చంపారు. బాధితులు రక్తపు మడుగులో పడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే అది చూసి నవ్వుతూ రాక్షసానందం పొందారు.

Double Murder on Delhi street : రాక్షసానందం….బైక్ ను ఢీ కొట్టారని ఇద్దర్ని పొడిచి చంపిన యువకులు

Double Murder On Delhi Street

Updated On : March 16, 2021 / 5:06 PM IST

caught on CCTV, Double Murder on Delhi street, accused kept stabbing : ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమబైక్ ను ఢీ కొట్టారనే కోపంతో ఇద్దరు టీనేజర్లు మరో ఇద్దరిని పిడిగుద్దులు గుద్ది, కత్తులతో పొడిచి చంపారు. బాధితులు రక్తపు మడుగులో పడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే అది చూసి నవ్వుతూ రాక్షసానందం పొందారు. వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.

రోహిత్ అగర్వాల్,(23) ఘన్ శ్యామ్(20) అనే ఇద్దరు యువకులు అర్ధరాత్రి సమయంలో ఢిల్లీలోని ఉద్యోగ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక సందులో వెళుతున్నారు. ఆ సమయంలో వీరు నడుపుతున్న బైక్ పొరపాటున, నిందితుల బైక్ ను ఢీ కొట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.

నలుగురు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. నిందితులు ఇద్దరు యువకులను కిందపడేసి కొట్టారు. ఇంతలో ఒక నిందితుడు కత్తితీసి రోహిత్ ను పొడిచాడు.

ఘన్ శ్యామ్ ఇతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించటంతో మరో నిందితుడు వారిద్దరిపై పిడిగుద్దులు కురిపిస్తూ కింద పడేశాడు. అందులో  మొదటి నిందితుడు వచ్చి ఘన్ శ్యామ్ ను కత్తితో కసితీరా పొడిచాడు.  అర్ధరాత్రి అవటంతో ఆ సమయంలో రొడ్డుపై జనసంచారం  లేదు.

ఆ తర్వాత ఇద్దరు నిందితులు కలిసి మరోసారి బాధితులను తీవ్రంగా కొట్టారు. చనిపోయేంత వరకు కత్తితో పొడుస్తూనే ఉన్నారు. బాధితులు కత్తిపోట్లతో బాధ పడుతుంటే చూస్తూ ఆనందించారు. వారు స్పృహ తప్పిన తర్వాత నిందితులిద్దరూ అక్కడి నుంచి బైక్ పై వెళ్ళిపోయారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు రక్తపు మడుగులో పడి ఉన్నారని పోలీసులకు సమాచారం రావటంతో వారు ఘటనా స్ధలానికి వచ్చి బాధితులిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు తెలిపారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆప్రాంతంలో లభించిన సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితులను గుర్తించారు. నిందితుల్లో ఒకరు మైనర్ అని, మరోకరు కొహ్లి(19) అని పోలీసులు తెలిపారు. నిందితులు వాడిన బైక్, వారు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.