చైన్ స్నాచర్ దారుణం : ఒంటరి మహిళపై ఇలా దాడి చేశాడు

  • Published By: chvmurthy ,Published On : September 7, 2019 / 11:52 AM IST
చైన్ స్నాచర్ దారుణం : ఒంటరి మహిళపై ఇలా దాడి చేశాడు

Updated On : September 7, 2019 / 11:52 AM IST

ఢిల్లీలోని ఛావ్లా ప్రాంతం. శుక్రవారం, సెప్టెంబర్6, మిట్ట మధ్యాహ్నం వేళ… ఓ మహిళ తన పిల్లాడిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకువెళుతోంది. ఒక చేత్తో పిల్లాడిని నడిపిస్తూ.. మరోచెత్తో స్కూల్ బ్యాగ్ పుచ్చుకుని వెళుతోంది. తన ఇంటికి వెళ్లే మార్గంలో ఉన్న ఆ వీధి నిర్మానుష్యంగా ఉంది. వీధిలో వీరిద్దరు తప్ప ఇంకెవ్వరూ లేరు. 

ఇంతలో వెనుక నుంచి ఒక బైక్ పై ఇద్దరు వ్యక్తులు ఆమెను దాటుకుని ముందుకు వెళ్లిపోయారు. ఒకడు బైక్ దిగి నిలబడ్డాడు. ఒకడు బైక్ రివర్స్ చేసుకుని వెనక్కు తిరిగి వెళ్లి కొంచెం ముందు ఆపాడు. వీరిని  పెద్దగా పట్టించుకోని మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. బైక్  దిగిన ఆగంతకుడు ఆమె మెడలో బంగారు గొలుసు తెంచుకుని పరుగెత్తుకెళ్లి ఆపి ఉన్న బైక్ ఎక్కాడు.

హఠాత్తుగా జరిగిన ఈ ఘటనకు ఆంగతకుడి వెంట పడిన మహిళ పట్టుకోలేక పోయింది. అప్పటికే స్టార్ట్ అయి ఉన్న బైక్ పై ఇద్దరూ పరారయ్యారు.  పట్టపగలు జరిగిన ఈ సంఘటన సమీపంలోని ఒక సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసుల సీసీటీవీ ఆధారాలతో నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.