Abuse Videos : అశ్లీల చిత్రాలు చూపించిన ఉపాధ్యాయుడికి దేహశుధ్ధి
విద్యార్థులను సన్మార్గంలో నడిపించే ఉపాధ్యాయుడు విద్యార్థినులకు సెల్ ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూపించిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా ధర్మ

Abuse Videos
Abuse Videos : విద్యార్థులను సన్మార్గంలో నడిపించే ఉపాధ్యాయుడు విద్యార్థినులకు సెల్ ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూపించిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినులకు అశ్లీల వీడియోలు చూపించాడని వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిని చితకబాదారు.
ధర్మారం మండలం కొత్తూరు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఓ టీచర్ ఫిబ్రవరి 28 సైన్స్ డే సందర్భంగా విద్యార్థులకు సెల్ ఫోన్‌లో సైన్స్ ప్రయోగాలు చూపించాడు. అయితే తమకు అశ్లీల చిత్రాలు చూపించాడని పేర్కొంటూ ఇద్దరు విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు చెప్పగా అప్పటి నుంచి పాఠశాలలకు సెలవులు రావడంతో ఈ విషయాన్ని మర్చిపోయారు. అయితే సదరు ఉపాధ్యాయుడు తొమ్మిదో తరగతి చదువుతున్న మరో విద్యార్థినికి అశ్లీల చిత్రాలు చూపించాడు.
దీంతో ఆ విద్యార్థిని ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు తెలుపగా దీంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు ఫోన్ చేసి ప్రధానోపాధ్యాయురాలుకి ఫిర్యాదు చేశారు. అనంతరం గ్రామస్థులతో కలిసి పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుడిని గదిలో బంధించి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఉపాధ్యాయుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
Also Read :Constable Suicide : కానిస్టేబుల్ ఆత్మహత్య- కారణం తెలిస్తే ఆశ్చర్య పోతారు. ..!
ఈ విషయమై ప్రధానోపాధ్యాయురాలు డిఇఓకి ఫిర్యాదు చేయగా డీఈఓ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుడి నిర్వాకాలపై ఈరోజు ఎంఈఓ ఛాయాదేవి వివరాలు సేకరించి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపిస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ ఘటనపై ఇంతవరకూ ఎవరూ పోలీస్ స్టేషన్ కి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఎస్ఐ తెలిపారు.