Harassment : ప్రేమిస్తున్నానని తోటి ఉద్యోగి వేధింపులు…వీఆర్ఏ ఆత్మహత్య

సహోద్యోగే ప్రేమిస్తున్నానంటూ వెంటబడి వేధించడంతో...భరించలేని వీఆర్ఏ బలవన్మరణానికి పాల్పడిన ఘటన పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో చోటుచేసుకుంది.

Harassment : ప్రేమిస్తున్నానని తోటి ఉద్యోగి వేధింపులు…వీఆర్ఏ ఆత్మహత్య

Updated On : April 26, 2021 / 3:55 PM IST

Co worker  harassing VRA by the name of love : సహోద్యోగే ప్రేమిస్తున్నానంటూ వెంటబడి వేధించడంతో…భరించలేని వీఆర్ఏ బలవన్మరణానికి పాల్పడిన ఘటన పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో చోటుచేసుకుంది. నిమ్మనపల్లి గ్రామానికి చెందిన దివ్య, సబ్బితం గ్రామానికి చెందిన శేఖర్‌ అనే వ్యక్తిని కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకుంది.

పెళ్లైన తర్వాత మనస్పర్ధలు రావటంతో భార్యా భర్తలిద్దరూ విడాకులు తీసుకున్నారు. నిమ్మనపల్లి వీఆర్‌ఎగా విధులు నిర్వహిస్తూ దివ్య ప్రస్తుతం పెద్దపల్లి మండల తహసీల్దార్‌ కార్యాలయంలో డెప్యూటేషన్‌పై పనిచేస్తోంది. ఈ క్రమంలో కొత్తపల్లి గ్రామ వీఆర్‌ఏ పెర్క వెంకటేశ్‌ ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి వేధించసాగాడు.

వెంకటేష్ వేధింపులు భరించలేని దివ్య , మనస్తాపానికి గురై ఇంట్లో దూలానికి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి సోదరుడు దిలీప్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు ఉన్నారు.