తుని పోలీసు స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని స్త్రీ శవం లభ్యం

తుని పోలీసు స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని స్త్రీ శవం లభ్యం

dead body

Updated On : February 28, 2021 / 5:09 PM IST

cops found woman dead body at tuni police station limits : విశాఖజిల్లా తుని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని ఒక స్త్రీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

తుని మండలం లోవకొత్తూరు గ్రామ శివారులో, జగన్నాధగిరి నుండి పారుపాక పోవు తారు రోడ్డుకు కుడి ప్రక్కన గల మామిడి తోటలో సుమారు 20 నుండి 30 సంవత్సరముల వయసు కలిగిన వివాహిత స్త్రీ యొక్క శవం సగం కాలిన స్తితిలో పడి ఉన్నది. ఇది చూసిన స్దానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్ధలికి వచ్చిన పోలీసులు పంచానామా నిర్వహించారు. మృతదేహంపై ఎరుపు రంగు కలిగిన జాకెట్టు ఉన్నది. సదరు స్త్రీ యొక్క కుడి చేతి మధ్య వేలికి లక్ష్మీదేవి బొమ్మ ఉన్న ఇత్తడి ఉంగరం, ఉంగరపు వేలికి సిల్వర్ ఉంగరం, ముక్కుకు బంగారపు ముక్కుపుడక ఉన్నవి.రెండు కాళ్ళకు మట్టెలు ఉన్నవి. కుడికాలికి నలుపురంగు దిష్టి తాడు కట్టబడి ఉన్నది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు  మహిళను గుర్తించేందుకు  దర్యాప్తు చేస్తున్నారు.