ముంబై నటి కేసులో మరో కీలక పరిణామం..
తనపై అక్రమ కేసు నమోదు, తన అరెస్ట్, జైలుకు పంపిన విధానం..

Kadambari Jethwani Case (Photo Credit : Google)
Mumbai Actress Case : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ముంబై నటి కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ కోర్టులో నటి కాదంబరి జెత్వానీ స్టేట్ మెంట్ రికార్డు చేశారు. పోలీస్ యాక్ట్ 164 ప్రకారం విజయవాడ ఏసీబీ కోర్టులో జత్వానీ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. తనపై అక్రమ కేసు నమోదు, తన అరెస్ట్, జైలుకు పంపిన విధానం.. దీనిపై జెత్వానీ స్టేట్ మెంట్ ను రికార్డు చేసింది కోర్టు. కస్టడీ సమయంలో పోలీసుల వేధింపులు తదితర అంశాలు న్యాయమూర్తికి తెలిపారు జెత్వానీ. సుమారు 6 గంటల పాటు ముంబై నటి చెప్పిన అన్ని విషయాలను వీడియో రూపంలో రికార్డ్ చేసింది ఏసీబీ కోర్టు.
Also Read : గుండెలు పిండే విషాదం..! టీచర్ ప్రాణం తీసిన ఫోన్ కాల్..!
సంచలనం రేపిన ముంబై నటి కేసులో పోలీసులు ఐదుగురిని నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. వీరిలో ఐపీఎస్ అధికారులూ ఉన్నార. ఏ1గా కుక్కల విద్యాసాగర్, ఏ2గా పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏ3గా కాంతిరాణా, ఏ4గా అప్పటి వెస్ట్ జోన్ ఏసీపీ హనుమంతరావు పేర్లను నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పటికే వీరిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఈ కేసులో నటి ఫిర్యాదుతో పోలీసులు కుక్కల విద్యాసాగర్ ను అరెస్ట్ చేసిన విషయం విదితమే. పోలీసులు విద్యాసాగర్ ను డెహ్రాడూన్ లో అదుపులోకి తీసుకున్నారు.
ముంబై నటికి వేధింపుల కేసును చంద్రబాబు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో నిందితులను వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఆదేశాలతో పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.