Real Estate Cheater : రియల్ ఎస్టేట్ మోసగాడు సుధాకర్ నాయుడు అరెస్ట్
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పేరుతో పలువురిని మోసం చేసిన సాయిసుధాకర్ నాయుడును సైబరాబాద్ పోలీసుల అరెస్ట్ చేశారు. నాలుగేళ్లుగా కోర్టు నుండి స్టే తెచ్చుకుని జైలు శిక్ష తప్పిం

Arrested
Real Estate Cheater : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పేరుతో పలువురిని మోసం చేసిన సాయిసుధాకర్ నాయుడును సైబరాబాద్ పోలీసుల అరెస్ట్ చేశారు. నాలుగేళ్లుగా కోర్టు నుండి స్టే తెచ్చుకుని జైలు శిక్ష తప్పించుకుంటున్నాడు.
రియల్ ఎస్టేట్‌లో ఒక్కో ప్లాటు ఇద్దరు ముగ్గరికి రిజిష్ట్రేషన్ చేస్తూ కోట్లాది రూపాయలు ప్రజల వద్ద నుంచి వసూలు చేశాడు. హైద్రాబాద్, విజయవాడ, విశాఖ, రాజమండ్రిలో సుధాకర్ పై 40 కేసులు ఉన్నాయి. టీవీ ఛానెల్ షేర్‌ల విక్రయం పేరుతో రూ.20 కోట్లు మోసం చేశాడు.
సుధాకర్ నాయుడు ఫోర్జరీ సంతకాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లలో మోసాలకు పాల్పడ్డాడు. భూ కబ్జాలు, చెక్ బౌన్స్ కేసులు, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించటం, మహిళలపై లైంగికవేధింపులకు పాల్పడిన కేసులు కూడా నిందితుడిపై ఉన్నాయి.
Also Read : Young Man Hangs With Kite : గాలిపటంతో ఎగిరిన యువకుడు
కొత్తూర్‌లో 28 ఎకరాలలో ఎంఎస్ఆర్ వెంచర్ వేసి ప్లాట్లు అమ్మి ప్రజలనుమోసగించాడు. ప్రతి వెంచర్ లోనూ మోసాలు జరగటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ పోలీసులు ఈరోజు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. సుధాకర్ నాయుడు గతంలో పోలీసు కానిస్టేబుల్ గా పని చేసేవాడు.