Drugs Racket : ఈజీ మనీ, విలాసాల కోసం అడ్డదారి తొక్కిన స్నేహితులు.. చివరికి అడ్డంగా దొరికిపోయారు

గతంలోనూ వీరిద్దరిపై కేసులు నమోదయ్యాయని, జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినా.. మళ్లీ అదే పని చేస్తున్నట్లుగా గుర్తించారు.

Drugs Racket : ఈజీ మనీ, విలాసాల కోసం అడ్డదారి తొక్కిన స్నేహితులు.. చివరికి అడ్డంగా దొరికిపోయారు

Drugs Racket : హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు మరో డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. బెంగళూరులో నైజీరియన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్న కాటూరి సూర్యకిషన్, గుత్తుల శ్యాంబాబులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రికి చెందిన ఈ స్మగ్లర్ల నుంచి 4.2 లక్షలు విలువ చేసే 28 గ్రాముల ఎండీఎం డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరూ స్నేహితులు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డారు.

సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో అడ్డదారి తొక్కారు. డ్రగ్స్ కొనుగోలు చేసి విద్యార్థులకు విక్రయిస్తున్నట్లుగా పోలీసులు తేల్చారు. గతంలోనూ వీరిద్దరిపై కేసులు నమోదయ్యాయని, జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినా.. మళ్లీ అదే పని చేస్తున్నట్లుగా గుర్తించారు. గ్రాముకు 10వేల నుంచి 15వేల రూపాయలకు డ్రగ్స్ అమ్ముతూ వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read : ప్రముఖ సినీ నటుడి కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి