ధార్వాడ్ లో భవనం కూలిన ఘటన : 14 కు చేరిన మృతుల సంఖ్య

కర్ణాటక ధార్వాడ్ లో భవనం కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 14 కు చేరింది.

  • Published By: veegamteam ,Published On : March 22, 2019 / 07:35 AM IST
ధార్వాడ్ లో భవనం కూలిన ఘటన : 14 కు చేరిన మృతుల సంఖ్య

Updated On : March 22, 2019 / 7:35 AM IST

కర్ణాటక ధార్వాడ్ లో భవనం కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 14 కు చేరింది.

బెంగళూరు : కర్ణాటకలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 14 కు చేరింది. ధార్వాడ్ లో మార్చి 19న నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. డిప్యూటీ కమిషనర్ దీపా చోలాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మొత్తం 14 మంది చనిపోయినట్లు తెలిపారు.
Read Also : నేషనల్ టెక్స్ టైల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

ఇద్దరిని రక్షించామని తెలిపారు. ముగ్గురికిపైగా శిథిలాల కింద చిక్కుకున్నారని, వారికి ఆక్సిజన్ మరియు ఓఆర్ ఎస్ అందిస్తున్నామని చెప్పారు. ఎస్ డీఆర్ఎఫ్ మరియు ఎన్ డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయని తెలిపారు.

భవనం యజమానులు రవి బస్వరాజ్ సబరాద్, బసవరాజ్ డి నిగడ, గంగప్ప ఎస్.సింత్రి, మహాబలేశ్వర్ పురడగూడి మరియు ఇంజనీర్ వివేక్ పవార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు యజమానులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఇంజనీర్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 
Read Also : సెల్ఫీ ప్లీజ్ : వామ్మో.. ఎయిర్ పోర్ట్ లో షార్క్.. ప్రయాణీకులు షాక్