Student Murder : పెద్దపల్లి జిల్లాలో ఘోరం.. డిగ్రీ విద్యార్థి దారుణ హత్య

పెద్దపల్లి జిల్లాలో ఘోరం జరిగింది. డిగ్రీ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన దామ తరుణ్(19) ను గుర్తు తెలియని వ్యక్తులు..

Student Murder : పెద్దపల్లి జిల్లాలో ఘోరం.. డిగ్రీ విద్యార్థి దారుణ హత్య

Student Murder

Updated On : February 20, 2022 / 5:00 PM IST

Student Murder : పెద్దపల్లి జిల్లాలో ఘోరం జరిగింది. డిగ్రీ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన దామ తరుణ్(19) ను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామ శివారులో తరుణ్ మృతదేహం లభ్యమైంది.

Hyderabad : పందెంలో డబ్బు పోగొట్టుకున్నాడు.. తర్వాత భార్య అదృశ్యమైంది?

శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుండి బయటకు వెళ్లిన తరుణ్.. శవమై కనిపించాడు. తరుణ్ మృతికి ప్రేమ వ్యవహారం కారణం కావొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు.

Murder For Omelette : షాకింగ్.. ఆమ్లెట్ వేయలేదని భార్యను చంపిన భర్త

తరుణ్ మృతితో అతడి కుటుంబంలో విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. డిగ్రీ విద్యార్థి తరుణ్ హత్య స్థానికంగా సంచలనం రేపింది. తరుణ్ హత్యకు కారణం ఏంటి? ఎవరు చంపారు? అనేది తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.