ఢిల్లీలో బతుకులు బుగ్గి : పెరుగుతున్న మృతుల సంఖ్య

దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఈసారి 44 మంది చనిపోయారు. మరో 22 మందికిపైగా గాయాలపాలయ్యారు. వీరిలో కొంతమంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఝాన్సీ రోడ్‌లోని అనాజ్ మండీలో ఈ ఘోర ఫైర్ ఆక్సిడెంట్ జరిగింది. 2019, డిసెంబర్ 08వ తేదీ ఆదివారం వారి బతుకులు తెల్లారిపోతున్నాయి.
అనాజ్‌మండీలో ఆరంతస్తుల భవనంలో ప్లాస్టిక్ ఫ్యాకర్టీ ఉంది. ఆదివారం తెల్లవారుజామున ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సమయంలో అందులో పనిచేస్తున్న కార్మికులు నిద్ర పోయారు. గాఢ నిద్రలో ఉండడంతో ప్రమాద విషయం తెలియలేదు. తెలిసేసరికి అప్పటికే ఆలస్యం అయిపోయింది. తప్పించుకోవడానికి వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. భారీగా పొగ కమ్ముకోవడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. ఊపిరిఆడక చాలా మంది సృహ తప్పిపడిపోయారు. మంటల్లో సజీవ దహనమయ్యారు.
అగ్నిప్రమాదం వార్త తెలియగానే ఫైర్ సిబ్బంది స్పందించారు. 30కి పైగా ఫైరింజన్లు మంటలను అదుపు చేసే పనిలో పడ్డాయి. భవనంలో చిక్కుకున్న 56మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు. ప్లాస్టిక్ సామగ్రి కావడంతో మంటలు వేగంగా విస్తరించాయి. వెంటనే పక్కనే ఉన్న రెండు భవనాలకు కూడా మంటలు పాకాయి. చుట్టూ ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో ఎటూ కదల్లేని పరిస్థితి. మొత్తంగా 44 మంది చనిపోయారు. పొగ కారణంగానే ఎక్కువమంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువమంది కూలీలే. వీరంతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిగా భావిస్తున్నారు.
Read More : రెచ్చిపోయిన ప్రేమ జంట : మెట్రో రైలులో హాట్ హాట్ రొమాన్స్