దేశవ్యాప్త సంచలనం…ఇన్ స్టా ప్రైవేట్ చాట్ గ్రూప్ “బాయిస్ లాకర్ రూమ్” అడ్మిన్ అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బాయిస్ లాకర్ రూమ్’అనే ప్రైవేట్ చాట్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని బాలికల ఫొటోలను మార్ఫింగ్ చేసి,వారిపై అసభ్యంగా కామెంట్స్ చేస్తున్న మైనర్ విద్యార్థులపై ఢిల్లీ సైబర్ క్రైమ్ విభాగం చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించిన బాయిస్ లాకర్ రూమ్ అడ్మిన్‌ను బుధవారం ఢిల్లీ సైబర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నోయిడాలోని ఒక ప్రముఖ స్కూల్‌లో 12వ తరగతి పూర్తి చేసుకున్న 18 ఏళ్ల విద్యార్థి ఆ గ్రూప్ అడ్మిన్‌గా గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అతడిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి గ్రూప్‌లోని ఇతర విద్యార్థుల సమాచారం సేకరించారు.
ఈ క్రమంలో దాదాపుగా 27 మంది గ్రూప్ సభ్యులను గుర్తించిన పోలీసులు.. వారి ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు. ఆ గ్రూప్‌లోని మైనర్ సభ్యులను పోలీసులు వారి తల్లిదండ్రులు, ఎన్జీఓ ప్రతినిధుల ముందు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 13 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయస్సున విద్యార్థులే ఉండటం గమనార్హం. ఢిల్లీలోని 3 ప్రముఖ పాఠశాలలకు చెందిన విద్యార్థులుగా వారిని గుర్తించారు.
ఇన్ స్టాగ్రామ్ లో బాయిస్ లాకర్ రూమ్ పేరిట ఓ గ్రూప్‌ను ఏర్పాటు చేసిన వీరు.. బాలికల ఫొటోలను మార్ఫింగ్ చేసి కామెంట్లు చేసేవారు. బాలికల ఫొటోలను నగ్న ఫొటోలుగా మార్ఫ్ చేసి, గ్రూప్ చాట్ రూమ్‌లో షేర్ చేసుకుంటూ అసభ్యకర, నేరపూరిత సందేశాలను పంపుకునేవారు. లైంగిక దాడులు, రేప్ వంటి పదాలతో చాటింగులు చేసుకునేవారు. ఆ డిస్కషన్స్‌కు సంబంధించి స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాట్ రూమ్ లో షేర్ చేసిన తన ఇమేజీని చూసిన ఓ విద్యార్థిని ఈ గ్రూప్ సంభాషణల స్క్రీన్ షాట్స్‌ను బహిర్గతపర్చడంతో మొదట ఈ గ్రూప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనికి ఆ విద్యార్థిని పోలీసులకు కంప్లెయింట్ చేసింది.
దీంతో ఢిల్లీ సైబర్ పోలీసులు అలర్ట్ అయ్యారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. అందులో భాగంగా గ్రూప్ అడ్మిన్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు.వారి చాటింగులు చూసి ఖాకీలే షాక్ తిన్నారు. ఇందులో టీనేజీ విద్యార్థినుల ఫోటోలను పోస్ట్ చేస్తూ.. ..’రేప్ కల్చర్ ని లాంచ్ చేద్దాం’, అందరం కలిసి గ్యాంగ్ రేప్ చేద్దాం’ అంటున్న వీరి విచ్చలవిడితనం చూసి తాము ఖంగు తిన్నామని ఖాకీలు చెప్పారు. ఈ గ్రూప్‌లో మొత్తం 51 మంది సభ్యులుగా ఉన్నట్లు తెలుస్తోంది.
బాలికలు తమ ఇన్‌స్టాగ్రామ్‌ల్లో పోస్ట్ చేసుకున్న ఫొటోలను వీరు అసభ్యంగా మార్ఫ్ చేసి బాయిస్ లాకర్ రూమ్ గ్రూప్‌లో షేర్ చేసేవారని,గ్రూప్ వివరాలను ఇన్‌స్టాగ్రామ్ నుంచి కోరామని పోలీసులు తెలిపారు. జువైనల్ జస్టిస్ చట్టం కింద వీరిపై చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు, ఇన్‌స్టాగ్రామ్‌కు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ కేసును సుమోటాగా స్వీకరించాలని కోరుతూ ఇద్దరు న్యాయవాదులు బుధవారం ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ డీఎన్ పటేల్‌కు లేఖ రాశారు. పొక్సో, ఐటీ చట్టాలు, ఐపీసీ కింద ఆ మైనర్లపై కేసులు నమోదు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరారు.
Also Read | Instagramలో గ్రూప్ చాట్.. గ్యాంప్ రేప్ చేయడంపై టీనేజర్ల డిస్కషన్