ఫోన్ కొనివ్వలేదని.. బిల్డింగ్ పైనుంచి దూకేసింది!
ఇప్పుడు ఎక్కడ చూసిన డిజిటల్ మయం. ఆడుకునే పిల్లవాడి నుంచి కాలేజీకి వెళ్లే కుర్రాడి వరకు అందరికి మొబైల్ అంటే పడిచస్తారు. ఆల్కహాల్, డ్రగ్స్ కంటే ఎంతో డేంజర్ ఈ సెల్ ఫోన్. ఒకసారి ఫోన్ బారిన పడితే అంతే చాలు..

ఇప్పుడు ఎక్కడ చూసిన డిజిటల్ మయం. ఆడుకునే పిల్లవాడి నుంచి కాలేజీకి వెళ్లే కుర్రాడి వరకు అందరికి మొబైల్ అంటే పడిచస్తారు. ఆల్కహాల్, డ్రగ్స్ కంటే ఎంతో డేంజర్ ఈ సెల్ ఫోన్. ఒకసారి ఫోన్ బారిన పడితే అంతే చాలు..
కోల్ కతా: ఇప్పుడు ఎక్కడ చూసిన డిజిటల్ మయం. ఆడుకునే పిల్లవాడి నుంచి కాలేజీకి వెళ్లే కుర్రాడి వరకు అందరికి మొబైల్ అంటే పిచ్చి. వ్యామోహం. ఇంకా చెప్పాలంటే వెర్రి.. చేతిలో మొబైల్ ఉంటే చాలు.. అరచేతిలో ప్రపంచాన్ని చుట్టి రావచ్చు. ఆల్కహాల్, డ్రగ్స్ కంటే ఎంతో డేంజర్ ఈ సెల్ ఫోన్. ఒకసారి ఫోన్ బారిన పడితే అంతే చాలు.. అన్నం లేకపోయిన ఉంటారు. కానీ ఫోన్ లేదంటే అయిపోయినట్టే. ఇళ్లు పీకి పందిరేస్తారు. చదువుకునే అమ్మాయివి నీకు ఫోన్ ఎందుకని తిట్టిపోస్తారు. అయిన పిల్లలు మాట వింటే కదా. ఇలాగో 17ఏళ్ల విద్యార్థిని తన తండ్రి ఫోన్ కొనివ్వలేదని స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకేసింది. ఈ ఘటన కోల్ కతాలోని ఆర్యా కన్య హైస్కూల్ దగ్గర చోటుచేసుకుంది. నాలుగు అంతస్థుల బిల్డింగ్ పై ఎక్కేసిన విద్యార్థిని ఒక్కసారిగా దూకేసినట్టు స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. తీవ్రగాయాలపాలైన ఆ విద్యార్థినిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
తన తండ్రి ఫోన్ కొనివ్వలేదని మనస్తాపం చెందిన విద్యార్థిని క్లాసులు ముగిసాక స్కూల్ టెర్రస్ పైకి ఎక్కి ఆత్మహత్యకు యత్నించినట్టు అమృత్ సర్ పోలీసు అధికారి మీడియాకు వెల్లడించారు. కోల్ కతాలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయని, ప్రత్యేకించి యువత ఎక్కువ శాతం ఫోన్లతోనే గడిపేస్తున్నారని వీరికి డి అడిక్షన్ థెరపీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైన ఉందని సైకాలజీ నిపుణుడు జే రామ్ పేర్కొన్నారు. ఆల్కహాల్, డ్రగ్స్ తో పోలిస్తే డిజిటల్ అడిక్షన్ ఎంతో క్రిటికల్ గా మారిందన్నారు. ఫోన్లకు అడిక్ట్ అయినవారిని పూర్తిగా దూరంగా ఉంచలేమని తెలిపారు. అలా చేస్తే పిల్లల్లో ఇలాంటి ఆత్మహత్య ఘటనలకు పురిగొల్పుతుందని జేమ్ అభిప్రాయపడ్డారు.