చంచల్ గూడ జైలుకు ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులు

  • Published By: madhu ,Published On : November 30, 2019 / 11:15 AM IST
చంచల్ గూడ జైలుకు ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులు

Updated On : November 30, 2019 / 11:15 AM IST

డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం..హత్య కేసులో నలుగురు నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు. మహబూబ్ నగర్ జైలుకు తరలించాలని అనుకున్నా ప్రజాగ్రహంతో పోలీసులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. భారీ భద్రత మధ్య చంచల్ గూడ జైలుకు తరలించారు. వీరిని తరలిస్తున్న పోలీసు బస్సుపైకి ప్రజలు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. వారిని చెదరగొట్టారు. పోలీసులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ ప్రియాంక అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వేలాదిగా వచ్చిన జనాలతో షాద్ నగర్ పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 

2019, నవంబర్ 30వ తేదీ శనివారం షాద్ నగర్ పీఎస్ వద్దకు నిందితులను తీసుకొచ్చారు. అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే వేలాది మంది జనాలు పీఎస్‌ వద్దకు చేరుకున్నారు. తమకు నిందితులను అప్పగించాలని డిమాండ్ చేశారు. వీరిని అదుపు చేయడానికి పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను మోహరించాయి. కానీ ప్రజాగ్రహం మరింత ఎక్కువైంది.

బారికేడ్లను తొలగించి పీఎస్‌లోకి తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ప్రజలు సంయమనం పాటించాలని..నిందితులకు కఠినంగా శిక్షిస్తామని శంషాబాద్ డీసీపీ మైక్‌లో చెప్పారు. అంతకంటే ముందు..షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌కు మేజిస్ట్రేట్ పాండునాయక్ చేరుకున్నారు. నలుగురు నిందితులను పోలీసులు హాజరుపర్చారు. మేజిస్ట్రేట్ నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. 

అనంతరం మోహరించిన నిరసనకారులను పీఎస్‌ నుంచి దూరం పంపించారు. షాద్ నగర్ నుంచి చంచల్ గూడ వెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ప్రజలు ముందుకు రాకుండా..కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 
Read More : అక్క కాదు.. చెల్లి కాదు.. ఎలాంటి బంధం లేదు.. అయినా వాళ్లను చంపేస్తాం