Encounter In Mulugu District : తెలంగాణలో ఎన్‌కౌంటర్- ముగ్గురు మావోయిస్టులు మృతి
తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలం పేరూర్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది.

En Counter In Mulugu District
Encounter In Mulugu District: తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలం పేరూర్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. తెలంగాణ సరిహద్దు- చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ తర్లగూడ సరిహద్దు ప్రాంతంలో సోమవారం ఉదయం పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
సోమవారం ఉదయం తెలంగాణ పోలీసులు, గ్రే హౌండ్స్ కు చెందిన దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు పోలీసుల పైకి కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురు కాల్పులు జరపటంతో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఈకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు.
Also Read : Husband Cheating Wife : ప్రేమ, పెళ్లి పేరుతో గర్భవతిని చేసి పారిపోయిన భర్త
ఘటనా స్ధలంనుంచి ఎస్ఎల్ ఆర్, ఏకే 47 రైఫిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో వాజేడు – వెంకటాపురం ఏరియా కమాండర్‌గా గతంలో పనిచేసిన సుధాకర్ ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఇద్దరు మావోయిస్టులు కూడా పార్టీలో ప్రముఖులు అని తెలుస్తోంది. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.