జ్యోతి రీ పోస్టుమార్టం : తొలి పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వాలన్న కుటుంబ సభ్యులు
మంగళగిరిలో గ్యాంగ్ రేపు, హత్యకు గురైన జ్యోతి మృతదేహానికి రీపోస్టుమార్టం ముగిసింది.

మంగళగిరిలో గ్యాంగ్ రేపు, హత్యకు గురైన జ్యోతి మృతదేహానికి రీపోస్టుమార్టం ముగిసింది.
అమరావతి : మంగళగిరిలో గ్యాంగ్ రేపు, హత్యకు గురైన జ్యోతి మృతదేహానికి రీపోస్టుమార్టం ముగిసింది. తాడేపల్లిలోని స్మశాన వాటికలో ఖననం జ్యోతి డెడ్ బాడీని బయటకు తీసి రీ పోస్టుమార్టం నిర్వహించారు. తొలి పోస్టుమార్టం రిపోర్టు బహిర్గతం చేసే వరకూ కదలనివ్వబోమని జ్యోతి తరపు బంధువులు తేల్చి చెప్పారు. తొలి పోస్టుమార్టం రిపోర్టును బహిర్గతం చేయాలంటూ జ్యోతి కుటుంబ సభ్యులు, గిరిజన నేతలు డాక్టర్లను అడ్డుకున్నారు. డాక్టర్ల కారును అడ్డగించి అక్కడే భైఠాయించారు. పోలీసులు, జ్యోతి కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు దురుసుగా ప్రవర్తించారని జ్యోతి తరపు బంధువు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచి జ్యోతి బంధువుల రోదనలు మిన్నంటాయి.