జగిత్యాల జిల్లాలో ఘరానా మోసం : రూ.30 వేలు తీసుకొని తప్పుడు ఆధార్ కార్డులు
జగిత్యాల జిల్లా కోరుట్లలో నకిలీ ఆధార్ కార్డుల కలకలం రేపాయి. రూ.30 వేల రూపాయలు తీసుకొని ఇద్దరు కేటుగాళ్లు తప్పుడు ఆధార్ కార్డులు ఇచ్చారు.

జగిత్యాల జిల్లా కోరుట్లలో నకిలీ ఆధార్ కార్డుల కలకలం రేపాయి. రూ.30 వేల రూపాయలు తీసుకొని ఇద్దరు కేటుగాళ్లు తప్పుడు ఆధార్ కార్డులు ఇచ్చారు.
జగిత్యాల జిల్లా కోరుట్లలో నకిలీ ఆధార్ కార్డుల కలకలం రేపాయి. రూ.30 వేల రూపాయలు తీసుకొని ఇద్దరు కేటుగాళ్లు తప్పుడు ఆధార్ కార్డులు ఇచ్చారు. నక్కలగుంటకు చెందిన లలిత, ఆమె కమార్తె, ఇద్దరు కుమారులకు ముస్లీంల పేరుతో ఆధారాలు కార్డులు ఇచ్చారు. రూ.30 వేలు తీసుకొని హైదరాబాద్ కు తీసుకెళ్లిన వెళ్లి ఫీరోజ్, జియో అనే ఇద్దరు వ్యక్తులు నకిలీ కార్డులు తయారు చేసి ఇచ్చారు. సరైన ఆధార్ కార్డులు ఇప్పించాలని బాధితులు తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు.
లలిత కొంతకాలంగా ఆధార్ కార్డుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆమెకు ఫిరోజ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తనకు తెలిసిన జియో అనే వ్యక్తి మెట్ పల్లిలో ఆధార్ సెంటర్ ను నడుపుతున్నాడని అతన్ని కలిస్తే ఆధార్ కార్డులు తీయొచ్చని చెప్పాడు. జియోను కలిసిన లలితకు రూ.30 వేల ఖర్చు అవుతుందని చెప్పాడు. దీంతో ఆమె రూ.30 వేలు చెల్లించింది. ఇద్దరు వ్యక్తులు లలిత కుటుంబాన్ని హైదరాబాద్ కు తీసుకెళ్లి మరో మతానికి సంబంధించిన బురఖాలు, వారి పేర్లను మార్చి ఆధార్ కార్డులు తయారీ చేసి ఇచ్చారు.
వాటి ద్వారా ప్రభుత్వ పథకాలు వర్తించకపోవడంతో లలితకు అనుమానం వచ్చి స్థానికులతో ఆరా తీశారు. వీటికి ముప్పై వేల రూపాయలు చెల్లించామని చెప్పింది. అయితే మీ సేవా కేంద్రంలో రూ.100, రూ.150 లకే ఆధార్, రేషన్ కార్డులు వస్తాయిని స్థానికులు చెప్పారు. దీంతో మోసపోయాయని గ్రహించిన లలిత..ఇవాళ స్థానిక తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ముప్పై వేల రూపాయలు తీసుకొని, తనకు నకిలీ ఆధార్ కార్డులు ఇవ్వడం పట్ల లలిత, ఆమె కుటుంబం ఆందోళన చెండుతున్నారు.
లలితది నిరుపేద కుటుంబం. కష్టపడి పని చేసుకుంటే తప్ప పూట గడవని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కుటుంబం.. మోసాన్ని తట్టుకోలేకపోతున్నారు. తను చెల్లించిన రూ.30 వేలు తిరిగి ఇప్పించాలని బాధితురాలు లలిత కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ కు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు విచారణ మొదలు పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
జియో.. మెట్ పల్లిలో మీ సేవా కేంద్రం నడిపిస్తున్నాడు. తప్పుడు ఆధార్ కార్డులు తయారీ చేసి ఎంతమందికి ఇచ్చారు అనేది తెలియాల్సివుంది. దీనిపై లోతుగా విచారణ చేస్తే నకిలీ ఆధార్ కార్డులు ఇప్పించడం వెనుక ఉన్న ఆంతర్యమేంటో వెలుగుచూసే అవకాశం ఉంది.