Fake Doctor : నకిలీ డాక్టర్‌ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు

నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్ అవతారం ఎత్తి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కాంపౌండర్ ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

Fake Doctor : నకిలీ డాక్టర్‌ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు

Mahesh Bhagawat

Updated On : July 22, 2022 / 7:10 PM IST

Fake Doctor :  నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్ అవతారం ఎత్తి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కాంపౌండర్ ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. హాస్పిటల్ లో కాంపౌండర్ గా పని చేసుకుంటూ జీవన సాగిస్తున్న నల్గొండ జిల్లా హుజూర్ నగర్ కు చెందిన విజయ్ కుమార్ తోటి డాక్టర్లను చూసి తాను డాక్టర్ కావాలనుకున్నాడు.

చదివింది డిగ్రీ కానీ డాక్టర్ ఎలా అవ్వాలని ఆలోచించాడు… ఇంకేముంది… తన హాస్పిటల్ కు వచ్చిన అప్రోజ్ ఖాన్ అనే వ్యక్తి తో పరిచయం ఏర్పరచుకున్నాడు.   అఫ్రోజ్ ఖాన్ ద్వారా ఎంబీబీఎస్ చదివినట్లు సర్టిఫికెట్స్ తెప్పించాడు. ఇందుకోసం అఫ్రోజ్ ఖాన్ 2 లక్షలు తీసుకున్నాడు. ఇంకేముంది   ఎంబిబిఎస్ సర్టిఫికెట్స్ చేతికి వచ్చే సరికి విజయ్ కుమార్ కాస్తా డాక్టర్ విజయ్ గా అవతారం ఎత్తాడు.

ఆ సర్టిఫికెట్స్ చూపించి   హైదరాబాద్ లో ఒక హాస్పిటల్ లో   డాక్టర్ గా   చలామణీ అవుతూ దర్జాగా జీవనం సాగిస్తున్నాడు. ఆ తర్వాత రష్యా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ పేరుతో ఫేక్ సర్టిఫికెట్‌ను విజయ్ కుమార్‌కు ఇప్పించాడు అఫ్రోజ్ ఖాన్. ఈ సర్టిఫికెట్స్ ఇప్పించినందుకు అఫ్రోజ్ ఖాన్ దాదాపు 6 లక్షల 50 వేలు తీసుకున్నాడు.

ఇలా ఉండగా నల్గోండ జిల్లా హుజూర్ నగర్ కు చెందిన వారు విజయకుమార్ పని చేస్తున్న ఆస్పత్రికి వచ్చి డాక్టర్ అవతారంలో అతడిని చూసి షాకయ్యారు.   విజయకుమార్ డిగ్రీ చదువే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చదివాడు. ఇతను డాక్టర్ ఎలా అయ్యాడనే అనుమానం వచ్చిన వారు రాచకొండ పోలీసు కమీషనర్ కు పూర్తి సమాచారంతో వివరాలు ఇచ్చారు.

సమాచారం తీసుకున్న పోలీసులు విజయకుమార్ గురించి ఎంక్వైరీ చేయటం ప్రారంభించారు. అతని కదలికలు గమనిస్తూ పూర్తి ఆధారాలు సేకరించారు.  అనంతరం విజయకుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.  అతనికి సహకరించిన మహబూబ్ అలీ జునైద్, అఫ్రోజ్ ఖాన్ లను కూడా రాచకొండ ఎస్వోటి పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుల వద్ద నుంచి నకిలీ సర్టిఫికెట్స్, ఒక కార్, బైక్, మొబైల్స్, రెండు పాస్ పోర్ట్స్ స్వాదీనం చేసుకున్నారు.

Also Read : Tirumala : జులై 23న ఆన్‌లైన్‌లో వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ప్ర‌త్యేక ద‌ర్శ‌నం కోటా విడుద‌ల