Tirumala : జులై 23న ఆన్‌లైన్‌లో వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక దర్శనం కోటా విడుదల
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెలకు....

Tirumala On Line Senior Citizens Piligrims Quota
Tirumala : కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెలకు సంబంధించిన ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జులై 23వ తేదీన ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
రోజుకు వెయ్యి టోకెన్ల చొప్పున జారీ చేస్తారు. ఈ టోకెన్లు బుక్ చేసుకున్న వారిని మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌లో దర్శనానికి అనుమతిస్తారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ ఒక ప్రకటనలో భక్తులను కోరింది.
Also Read : Madhya Pradesh : స్కూటర్ సరిగ్గా నడపమన్నందుకు డిప్యూటీ కలెక్టర్ పై దాడి చేసిన దంపతులు