’రైతుబంధు’ అందలేదని రైతు ఆత్మహత్య

రైతుబంధు పెట్టుబడి సాయం అందలేదని ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

  • Published By: veegamteam ,Published On : February 9, 2019 / 12:59 PM IST
’రైతుబంధు’ అందలేదని రైతు ఆత్మహత్య

Updated On : February 9, 2019 / 12:59 PM IST

రైతుబంధు పెట్టుబడి సాయం అందలేదని ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సంగారెడ్డి : రైతుబంధు పెట్టుబడి సాయం అందలేదని ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నారాయణఖేడ్ మండలం సత్యగామలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… అంతారం ఈర్ రెడ్డి(52) అనే రైతుకు సత్యగామ శివారులో 8.08 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈర్ రెడ్డికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. పంటలు సక్రమంగా పండకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులతో సహా బేగంపేటకు వెళ్లి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మొదటి విడత రైతు బంధు పథకం కింద ఆయనకు రూ.32,800 చెక్కు మంజూరైంది. రెండో విడతకు సంబంధించి ఎన్నికల కోడ్ ఉండటంతో ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్మును జమ చేసేందుకు చర్యలు తీసుకుంది. ఈక్రమంలో ఈర్ రెడ్డి ఇంటి పేరుతో పాటు బ్యాంకు ఐఎఫ్ఎస్ సీ కోడ్ తప్పుగా నమోదవ్వడం వల్ల ఖాతాలో డబ్బులు జమ కాలేదు. దీంతో తన భూమి ఏమైపోతుందోనని ఈర్ రెడ్డి తరచుగా దిగులు పడేవారు. ఫిభ్రవరి 7న సత్యగామకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చి ఫిభ్రవరి 8 శుక్రవారం రోజు ఉదయం సొంత వ్యవసాయ భూమిలో వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబం కన్నీరుమున్నీరైంది. గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.