వివాహేతర సంబంధం – తండ్రి, కొడుకు బలవన్మరణం

వివాహేతర సంబంధం – తండ్రి, కొడుకు బలవన్మరణం

Updated On : February 28, 2021 / 12:18 PM IST

father and son ends her life in tamilnadu,Namakkal district : తమిళనాడులో ఘోరం జరిగింది. వివాహేతర సంబంధంతో చిన్నకొడుకు ఇంట్లోంచి ఒక మహిళతో లేచిపోయాడు. పోలీసులు ఇంట్లోని తండ్రి, పెద్ద కుమారుడ్ని పిలిచి విచారించారు. అది అవమానంగా భావించిన వారిద్దరూ బలవన్మరణానికి పాల్పడిన ఘటన సేలం జిల్లాలో చోటు చేసుకుంది. }

జిల్లాలోని మల్లూరు ప్రాంతానికి చెందిన సుబ్రమణి కార్మికుడు. అతనికి ఇద్దరు కుమారులు శంకర్(25) కృష్ణన్(21) వీరు ముగ్గురు నామక్కల్ జిల్లా ముత్తుకాపట్టిలోని ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. కాగా అక్కడ పని చేస్తున్న కొల్లంపట్టికి చెందిన భాస్కర్ అనే కార్మికుడి భార్యతో సుబ్రమణి చిన్నకుమారుడు కృష్ణన్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఈ క్రమంలో ఇద్దరూ కలిసి 15 రోజుల క్రితం ఇటుక బట్టీల వద్దనుంచి పరారరయ్యారు. భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సుబ్రమణి, శంకర్ లను పోలీసు స్టేషన్ కు పిలిచి విచారించారు. పోలీసులు తమని పిలిచి విచారంచటం అవమానంగా భావించిన తండ్రీ కొడుకులు శుక్రవారం ఇటుక బట్టీ సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.