Father Kills Daughter : దారుణం.. భార్య మీద కోపంతో ఏడాది పాపకు కరెంట్​ షాకిచ్చి చంపిన తండ్రి

భార్యపై కోపంతో కన్న బిడ్డనే పొట్టన పెట్టుకున్నాడో కీచక తండ్రి. ఏడాది వయసున్న చిన్నారిని.. కనికరం లేకుండా కరెంట్​ షాక్​ ఇచ్చి చంపేశాడు. సిద్దిపేట జిల్లా..

Father Kills Daughter : దారుణం.. భార్య మీద కోపంతో ఏడాది పాపకు కరెంట్​ షాకిచ్చి చంపిన తండ్రి

Father Kills Daughter

Updated On : December 3, 2021 / 9:14 PM IST

Father Kills Daughter : తల్లి అయినా తండ్రి అయినా పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటారు. వారికి చిన్న కష్టం వచ్చినా విలవిలలాడిపోతారు. పిల్లలపై అమితమైన ప్రేమ చూపించేది తల్లిదండ్రులే. అయితే కొందరు తల్లిదండ్రులు కోపంతో దారుణాలకు ఒడిగడుతున్నారు. పసిపిల్లలు అని కూడా చూడకుండా కడతేరుస్తున్నారు. ఎవరి మీదో ఉన్న కోపాన్ని అభంశుభం తెలియని పసి పిల్లలపై చూపిస్తున్నారు.

తాజాగా, భార్యపై కోపంతో కన్న బిడ్డనే పొట్టన పెట్టుకున్నాడో కీచక తండ్రి. ఏడాది వయసున్న చిన్నారిని.. కనికరం లేకుండా కరెంట్​ షాక్​ ఇచ్చి చంపేశాడు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో ఈ దారుణం జరిగింది.

Lemon Juice : వేడి నీటితో నిమ్మరసం… ఆరోగ్యానికి మంచిదేనా?

గ్రామానికి చెందిన రాజశేఖర్​.. దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన సునీతను రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. కొంతకాలం కాపురం సజావుగానే సాగింది. 11 నెలల క్రితం పాప జన్మించిన తర్వాత సునీత, రాజశేఖర్‌ తరచూ గొడవపడేవారు. వేరే కాపురం పెడడాదమని భార్య చెప్పగా రాజశేఖర్ వద్దన్నాడు.

పెద్దలు పలు మార్లు పంచాయితీ పెట్టి కలిసుండాలని దంపతులకు నచ్చజెప్పారు. అయినా దంపతుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్నం మరోసారి గొడవ జరిగింది. భార్య సునీతను కొట్టిన భర్త.. పాపను వ్యవసాయ బావి దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ కరెంటు షాకిచ్చి పాపను చంపేశాడు. పాప మృతి చెందిన తర్వాత రాజశేఖర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అంతకు ముందుగా తన తోటి రైతుకు ఫోన్​ చేసి ఇదే తన చివరి కాల్​ అని చెప్పాడు. సమాచారం అందుకున్న రాజశేఖర్​ కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకుని అతడిని గజ్వే‌ల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Winter Weight Loss : చలికాలంలో వ్యాయామాలు లేకుండా బరువు తగ్గటం ఎలా?

ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. భార్య మీద కోపంతో పసిపాపను హతమార్చడం ఏంటని స్థానికులు కన్నీటిపర్యంతం అయ్యారు. అసలతడు తండ్రేనా? అని మండిపడుతున్నారు. అలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.