Fire Accident : అగ్నికి ఆహుతైన ఆర్టీసీ బస్సు..తప్పిన ప్రాణాపాయం

హన్మకొండ నుండి   హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. 

Fire Accident : అగ్నికి ఆహుతైన ఆర్టీసీ బస్సు..తప్పిన ప్రాణాపాయం

Tsrtc Bus On Fire

Updated On : July 23, 2021 / 6:08 PM IST

Fire Accident : హన్మకొండ నుండి   హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది.   వరంగల్ వన్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ బస్టాండ్ వద్దకు చేరగానే బస్సు మోషన్ అందుకోవడం లేదని అనుమానం రావడంతో,   డ్రైవర్ బస్సును   పక్కకు ఆపి ప్రయాణికులు అందరినీ కిందకు దింపారు.

అప్పటికే బస్సులో నుండి పొగలు వచ్చి ఒక్కసారిగా మంటలు   చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది. స్టేషన్ ఘనపూర్‌‌లో ఫైర్ ఇంజన్ లేకపోవడంతో మంటలు ఆర్పేందుకు పోలీసులు, స్థానికుల  సహాయంతో బకెట్లతో నీళ్లు పోశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.